Begin typing your search above and press return to search.

బ్రహ్మితో ప్రయోగం చేస్తున్న భాగమతి డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   31 May 2023 7:00 PM GMT
బ్రహ్మితో ప్రయోగం చేస్తున్న భాగమతి డైరెక్టర్..!
X
భాగమతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అశోక్ అదే సినిమా హిందీలో రీమేక్ చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అంతకుముందు నానితో పిల్లజమీందార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ఆది సాయికుమార్ తో సుకుమారుడు.. అంజలితో చిత్రాంగద సినిమాలు చేశాడు. పిల్ల జమిందార్ తర్వాత మళ్లీ అతనికి హిట్ ఇచ్చిన సినిమా భాగమతి. ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో మరో ఛాన్స్ అందుకోలేదు. టాలెంట్ ఉన్నా సరే ఈ డైరెక్టర్ విషయంలో నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు అన్నది ఇన్నర్ టాక్.

ఇదిలా ఉంటే అశోక్ తన కొత్త సినిమా షూటింగ్ సైలెంట్ గా చేస్తున్నారని తెలుస్తుంది. హవిష్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారని తెలుస్తోంది. బ్రహ్మానందం పాత్ర ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని అంటున్నారు. రీసెంట్ గానే రంగమార్తాండ సినిమాతో బ్రహ్మానందం తన విలక్షణ నటనతో అందరిని మెప్పించాడు.

సినిమా ఫ్లాప్ అయినా బ్రహ్మానందం నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు అశోక్ సినిమా తర్వాత కూడా బ్రహ్మి పాత్ర గురించి అందరు అలానే చెబుతారని అంటున్నారు.

ఇక ఈ సినిమాకు అశోక్ ఎస్ బాస్ అనే పేరు పెట్టినట్టు తెలుస్తుంది. సినిమాలో బ్రహ్మానందం బాస్ అయితే అతని దగ్గర హవీష్ ఉద్యోగం చేస్తాడన్నమాట. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుందని అంతా సెట్ రైట్ అయితే జూలైలోనే సినిమా రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. భాగమతి హిట్ పడగానే అశోక్ వెంటనే మరో సినిమా చేసి ఉంటే బాగుండేది ఆ సినిమా టైం లో కూడా యువి వారితో ఏదో తేడాలు వచ్చినట్టు తెలుస్తుంది.

మొత్తానికి అశోక్ నెక్స్ట్ సినిమా అప్డేట్ ప్రేక్షకులకు మాంచి జోష్ ఇచ్చింది. ముఖ్యంగా బ్రహ్మానందం తో ప్రయోగం అనగానే ఎస్ బాస్ సినిమా మీద అంచనాలు పెరిగాయి. సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారని తెలుస్తుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత తెలుగులో అశోక్ చేస్తున్న పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

ఈ సినిమా ఈమధ్య ఆడియన్స్ కూడా విషయం ఉన్న సినిమాను తన భుజాన వేసి హిట్ చేస్తున్నారు. పిల్లజమిందార్, భాగమతి రెండు సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన అశోక్ ఎస్ బాస్ తో హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అన్నది చూడాలి. రంగమార్తాండ సినిమా తర్వాత బ్రహ్మానందం కి వెరైటీ పాత్రలు రాయాలని దర్శకులు ఫిక్స్ అయ్యారు. అశోక్ ఎస్ బాస్ కూడా క్లిక్ అయితే బ్రహ్మి కొత్త జర్నీ స్టార్ట్ చేసినట్టే లెక్క.