తడిసి ముద్దవుతున్న ఖిలాడీ బ్యూటీ

Mon May 10 2021 06:00:02 GMT+0530 (IST)

Dimple Hayathi offers

తెలుగులో గల్ఫ్ మరియు యురేఖ వంటి చిన్న సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ డింపుల్ హయతి. చిన్న చిత్రాలతో కెరీర్ ను నెట్టుకు వస్తున్న ఈ అమ్మడికి అనూహ్యంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గద్దలకొండ గణేష్ సినిమాలో ఛాన్స్ దక్కింది. దాంతో మరింత గుర్తింపు దక్కించుకున్న డింపుల్ హయతి ప్రస్తుతం రవిజేతో 'ఖిలాడీ' సినిమాలో నటిస్తోంది. ఖిలాడీ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే ఈమెకు మరిన్ని ఆఫర్లు కూడా వస్తున్నాయి. డింపుల్ కు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ మరియు తమిళం నుండి కూడా ఆఫర్లు వస్తున్నట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఖిలాడీ సినిమా విడుదలకు ముందే ఈమె మరో రెండు మూడు సినిమాలు చేసేలా ఉంది. తాజాగా తమిళంలో ఈమె యంగ్ స్టార్ హీరో విశాల్ కు జోడీగా ఒక సినిమా చేస్తోంది. ఇటీవలే ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. తమిళంలో ఈ అమ్మడికి ఇప్పటికే ఆఫర్లు తలుపు తడుతున్నాయి. కొత్తగా పలు ఆఫర్లు వచ్చినా కూడా దేనికి అధికారికంగా ఓకే చెప్పలేదు. తమిళంలో ఆఫర్లు వస్తున్న ఈ సమయంలోనే హిందీ నుండి కూడా ఈమెకు పిలుపు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. హిందీ యంగ్ హీరో కార్తీ ఆర్యన్ కు జోడీగా ఈమె నటించబోతుందట.

తమిళం మరియు హిందీల్లో ఒకేసారి ఆఫర్ దక్కించుకున్న ఈ అమ్మడు టాలీవుడ్ లో సైతం పెద్ద హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారిపోయింది. హిందీలో ఈమెకు వస్తున్న ఆఫర్లు చూస్తుంటే ముందు ముందు అక్కడే డింపుల్ సెటిల్ అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. మొత్తానికి ఖిలాడీ బ్యూటీ జోరు మామూలుగా లేదు. వరుసగా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఇతర భాషల్లో కూడా ఈమె ఎంట్రీకి రంగం సిద్దంగా ఉంది. మరి అక్కడ ఈమెకు ఎలాంటి ఫలితం దక్కుతుంది అనేది చూడాలి.