Begin typing your search above and press return to search.

దిల్ రాజు 'ఐకాన్'ని బన్నీకి కనబడేటట్లు చేస్తున్నాడా..?

By:  Tupaki Desk   |   9 April 2020 2:41 PM GMT
దిల్ రాజు ఐకాన్ని బన్నీకి కనబడేటట్లు చేస్తున్నాడా..?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - దిల్ రాజ్ కాంబినేషన్ లో ఇప్పటిదాకా ఆర్య, పరగు, దువ్వాడ జగన్నాధం అనే సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. వీరి కాంబినేషన్ లో నాలుగో సినిమాగా 'ఐకాన్' అనే సినిమాని గత ఏడాది బన్నీ పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. ఓ మై ఫ్రెండ్, ఎంసీఎ చిత్రాలకి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా ఆఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఏమైందో ఏమో కానీ ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా లేకుండా పోయింది. వాస్తవానికి ఈ సినిమా స్టోరీ డిస్కషన్ ఫస్ట్ సిట్టింగ్ లోనే అల్లు అర్జున్ ఇంప్రెస్స్ అయ్యాడట. కానీ సుకుమార్ స్క్రిప్ట్ అనుకున్న టైం కంటే ముందే రెడీ అవడంతో బన్నీ ఐకాన్ ని పక్కన పెట్టి 'పుష్ప' ని కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. అంతేకాకుండా అల వైకుంఠపురంలో లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తర్వాత 'పుష్ప'లాంటి సినిమా అయితే బాగుంటుందని బన్నీ భావించాడట. ఆ తర్వాత ఈ చిత్రం గురించి ఎలాంటి అప్డేట్ బయటకి రాకపోవడంతో ఇక ఆగిపోయిన‌ట్టే అని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం కూడా జరిగింది.

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ న‌టిస్తున్న చిత్రానికి 'పుష్ప‌' అనే టైటిల్‌ ని చిత్ర బృందం బుధ‌వారం బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా క‌న్ఫ‌మ్ చేసి ఫ‌స్ట్‌ లుక్ పోస్ట‌ర్‌ ని రిలీజ్ చేసింది. సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బ‌న్నీకి జోడీగా క్రేజీ భామ ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు - త‌మిళ‌ - మ‌ల‌యాళ‌ - క‌న్న‌డ - హిందీ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో అందరూ మర్చిపోయిన 'ఐకాన్‌' సినిమాని దిల్ రాజు టీమ్ మాత్రం మ‌ళ్లీ గుర్తు చేసింది. బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా 'ఐకాన్‌' టీమ్ బ‌ర్త్‌ డే విషెష్ చెబుతూ 'ఐ కాన్ - క‌నబడుట‌లేదు' అంటూ పోస్టర్ రిలీజ్ చేసారు.

గతేడాది ఏ పోస్టర్‌ ను అయితే విడుదల చేశారో.. ఇప్పుడు కూడా అదే పోస్ట‌ర్‌ ని విడుద‌ల చేసింది దిల్ రాజు టీమ్. పోస్ట‌ర్ పాత‌దే. కాక‌పోతే ఈ సినిమాపై కొత్త ఆశ‌లు చిగురించ‌డం మొద‌లెట్టాయి. ఈ సినిమా ప‌క్క‌న పెట్టేలేద‌ని, బ‌న్నీతో తీస్తామ‌న్న సంకేతాల్ని పంపింది చిత్ర‌బృందం. దీనితో ఐకాన్ సినిమా ఆగిపోలేదనే ఓ క్లారిటీ అయితే వచ్చింది. ప్రస్తుతం వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో 'వకీల్ సాబ్'ని తెరకెక్కిస్తున్నాడు. దాదాపు ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీటయింది. కరోనా కారణంగా బ్రేక్ పడిన ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ లోపు బన్నీ కూడా 'పుష్ప' సినిమాని దాదాపు కంప్లీట్ చేసి 'ఐకాన్' స్టార్ట్ చేస్తాడేమో చూడాలి. ఏదేమైనా దిల్ రాజు మాత్రం మర్చిపోయిన సినిమా గురించి అటు బన్నీకి ఇటు ఆయన ఫ్యాన్స్ కి గుర్తు చేసాడని చెప్పవచ్చు.