దిల్ రాజు ‘వి’ వ్యూహం ఏంటో?

Mon Aug 10 2020 06:00:01 GMT+0530 (IST)

Dil Raju on About V Movie Release

నాని 25వ చిత్రం ‘వి’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని విడుదలకు రెడీ అయిన సమయంలో కరోనా కారణంగా థియేటర్లు మూత పడ్డాయి. అప్పటి నుండి సినిమా విడుదలకు ఛాన్స్ లేకుండా పోయింది. గత అయిదు నెలలుగా ఆ సినిమా పూర్తి అయ్యి అలాగే మగ్గి పోతుంది.పూర్తి అయ్యి విడుదలకు నోచుకోని సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల అవుతున్నాయి. అయితే దిల్ రాజు మాత్రం ఓటీటీకి ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో విడుదల చేసినా సినిమా 30 కోట్ల బిజినెస్ చేస్తుంది. ఓటీటీలో ఆ స్థాయి రాకపోవచ్చు అనేది ఆయన అభిప్రాయం అయ్యి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రంలో మొదటి సారి నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయడంతో పాటు ఆయన ల్యాండ్ మార్క్ మూవీ అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అందుకే ‘వి’ చిత్రాన్ని మంచి సమయం చూసి సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో థియేటర్లు ఓపెన్ అయినా కూడా డిసెంబర్ వరకు వెయిట్ చేసి క్రిస్మస్ సందర్బంగా విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడు.

గతంలో నాని దిల్ రాజుల కాంబోలో వచ్చిన ఎంసీఏ చిత్రం క్రిస్మస్ కు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ‘వి’ చిత్రంను కూడా క్రిస్మస్ కు విడుదల చేస్తే పాజిటివ్ బజ్ ఉండే అవకాశం ఉందని దిల్ రాజు భావిస్తున్నాడట. మరి ‘వి’ చిత్రంకు దిల్ రాజు వ్యూహం ఫలించేనా చూడాలి.