'కేజీఎఫ్' స్టార్ తో దిల్ రాజు సినిమా!

Wed May 25 2022 10:37:07 GMT+0530 (IST)

Dil Raju movie with KGF star!

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ భారీ బడ్జెట్ చిత్రాల వైపు అడుగులు వేస్తున్నారు. నిర్మాతగా  స్పాన్ మరింత పెంచుతున్నారు.  క్వాలిటీలో ది బెస్ట్ అందించాలన్న కసి పట్టుదల ఆయనలో కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో తన  నిర్మాణ సంస్థ  సత్తా చాటాలన్నది ప్లాన్ గా కనిపిస్తుంది. రాజుగారు లైనప్ చూస్తే అది నిజమే అని మరోసారి రుజువవుతోంది.ప్రస్తుతం  దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ తో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. చరణ్ కిది 15 వ చిత్రం కావడం సహా...శంకర్ తో చేతులు కలిపి చేస్తోన్న తొలి చిత్రం కావడంతో అత్యంత ప్రతిష్టాత్మంకగా నిర్మిస్తున్నారు. చరణ్-శంకర్ కలయిక కావడంతో   పాన్ ఇండియా కేటగిరీలో చిత్రాన్ని  రిలీజ్ చేయాలని గట్టిగానే  ప్లాన్ చేస్తున్నారు.

మరోవైపు కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ ని తెలుగులో హీరోగా పరిచయం చేసే బాధ్యతలు రాజుగారు తీసుకున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని  రాజుగారు తెలుగు..తమిళ్ లో నిర్మిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్ లు కంటే ముందుగా విశ్వనటుడు కమల్ హాసన్ తో  'ఇండియన్ -2' చిత్రాన్ని నిర్మించాలని రంగంలోకి  దిగిన సంగతి  తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్  ప్రకటనతోనే రాజు గారు పాన్ ఇండియా లో ఫేమస్ అయ్యారు. కానీ చివరి నిమిషంలో  రాజు గారు అనివార్య కారణల వల్ల వెనక్కి తగ్గారు. అయితే ఇప్పుడు అంతకు మించి పెద్ద ప్లాన్ తోనే రాజుగారు రంగంలోకి దిగుతున్నారు. 'కేజీఎఫ్' ప్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ అయిన యశ్ తో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని  నిర్మించడానికి ఒప్పందం చేసుకున్నట్లు  ప్రచారం సాగుతోంది.

యశ్ తో దేశం గర్వించే గొప్ప సినిమా చేయాలని రాజుగారు పట్టుదలతో ఉన్నారని క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు?  నేరుగా రాజు గారు ఒక్కరే యశ్ తో ముందుకు  వెళ్తారా?  లేక యశ్ కి హోం బ్యానర్లా నిలిచిన హంబోలో ఫిల్మ్స్ తో టైటప్ అవుతారా? అన్న వివరాలపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.

ఆ కారణాలు ఎలా ఉన్నప్పటికీ యశ్ తో మాత్రం పాన్ ఇండియా సక్సెస్ ని అందుకోవాలని రాజు గారు సంకల్పించినట్లు  తెలుస్తుంది. ఇది నిజమైతే  నిర్మాతగా రాజుగారు క్రేజ్ మరింత పెరుగుతుంది.