పట్టుబట్టి సాధించిన దిల్ రాజు

Tue Jan 31 2023 15:00:01 GMT+0530 (India Standard Time)

Dil Raju interview comments

మహేష్ బాబుకు దిల్ రాజుకు చెడినట్లుగా గత ఏడాది ఒక టైంలో కొంచెం గట్టిగానే ప్రచారం జరిగింది. ‘సర్కారు వారి పాట’ వసూళ్ల గురించి నిర్మాతలు ప్రకటిస్తున్న నంబర్లు ఫేక్ అనే అర్థం వచ్చేలా పరోక్షంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ కామెంట్ల విషయంలో హర్టయిన మహేష్ బాబు.. దిల్ రాజును దూరం పెట్టారని తన తర్వాతి సినిమా నైజాం హక్కులు రాజుకు ఇవ్వకూడదని కండిషన్ పెట్టారని జోరుగా వార్తలు వచ్చాయి అప్పట్లో.ఐతే ఈ వ్యవహారం గుిరంచి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబుకు ఎవరో ఏదో చెబితే అపార్థం చేసుకుని ఉండొచ్చు అంటూనే.. ఒకవేళ మహేష్ కొత్త సినిమాను నేనే నైజాంలో రిలీజ్ చేస్తే అప్పుడేమంటారు? నేను ఫ్యాన్సీ రేటు ఇస్తే నిర్మాతలు కాదంటారా? అంటూ ఆయన ప్రశ్నించారు.

ఐతే అప్పుడు రాజు ఏమీ మాట వరసకు ఆ మాట అనలేదని స్పష్టమవుతోంది. పట్టుబట్టి మహేష్ కొత్త సినిమా నైజాం హక్కులను ఆయన సొంతం చేసుకున్నాడన్నది తాజా కబురు. హారిక హాసిని క్రియేషన్స్ బేనర్లో త్రివిక్రమ్ దర్శకుడిగా రూపొందుతున్న మహేష్ కొత్త సినిమా నైజాం హక్కులను దిల్ రాజు ముందు అన్నట్లే ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నాడట.

మహేష్ కెరీర్లో ఏ చిత్రానికీ లేని విధంగా ఏకంగా రూ.50 కోట్ల రేటు ఆఫర్ చేయడంతో నిర్మాతలు మరో ఆలోచన లేకుండా ఆయనకు రైట్స్ ఇచ్చేసినట్లు సమాచారం. ఐతే ఈ విషయంలో ఇది జరగడానికి ముందే మహేష్తో రాజుకు ప్యాచప్ అయిందని.. నిర్మాతలు ఈ విషయాన్ని మహేష్కు కమ్యూనికేట్ చేశాకే డీల్ పూర్తయిందని తెలుస్తోంది. మొత్తానికి ఆ రోజు సవాల్ చేసినట్లుగానే మహేష్ సినిమాను ఫ్యాన్సీ రేటుకు దిల్ రాజు సొంతం చేసుకున్నాడన్న వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.