దిల్ రాజు ఫుల్ క్లారిటీ.. కౌంటర్ ఇచ్చేదెవరు?

Fri Dec 02 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

Dil Raju full clarity Who will give the counter

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమిళ స్టార్ హీరో విజయ్ తో తొలి సారి క్రేజీ ప్రాజెక్ట్ గా `వారీసు`ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి రూపొందిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఈ మూవీని `వారసుడు` పేరుతో భారీ స్థాయిలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు. భారీ స్థాయిలో రూపొందిన ఈ మూవీని 2023 సంక్రాంతికి తమిళ తెలుగు భాషల్లో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.  ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కీలక థియేటర్లలని దిల్ రాజు ఈ మూవీ కోసం బ్లాక్ చేసి పెట్టుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై నిర్మాతల మండలి స్పందించి తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రకటన చేయడం..దానిపై తమిళ నిర్మాతలు మండిపడటం తెలిసిందే. ఆ తరువాత దర్శకుడు ఎన్. లింగుస్వామి కూడా తనదైన స్టైల్లో తెలుగు నిర్మాతల మండలిపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో `వారసుడు` వివాదం మరింతగా ముదిరింది.

ఈ వివాదం ఇలా వుండగానే తాజాగా నిర్మాత దిల్ రాజు `వారసుడు` రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించేశాడు. 2023 జనవరి 12నే తెలుగు తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టేగా ప్రకటించేశాడు. ఇదే సమయంలో చిరంజీవి `వాల్తేరు వీరయ్య` నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల కంటే ముందే తాను `వారసుడు` రిలీజ్ ని ప్రకటించానని వెల్లడించిన దిల్ రాజు అన్నట్టుగానే జనవరి 12ను తన సినిమాకు లాక్ చేసేశాడు.

ఈ మూవీతో పాటు అజిత్ నటిస్తున్న `తునీవు`ని కూడా దిల్ రాజు రిలీజ్ చేయబోతున్నాడు. ఇదే వివాదానికి ఆజ్యం పోసింది. నిర్మాతల మండలి ప్రకటన చేసేలా చేసింది. అయితే తాజాగా దిల్ రాజు పక్కా క్లారిటీ ఇవ్వడంతో తనకు కౌంటర్ ఇవ్వడానికి ఎవరూ సాహసించడం లేదు. గత కొన్ని రోజులుగా `వారసుడు` రిలీజ్ పై వివాదం నడుస్తున్నా దిల్ రాజు మాత్రం ఎక్కడా తగ్గకపోవడం గమనార్హం. ఫైనల్ గా రిలీజ్ డేటఖ ని కూడా ప్రకటించడంతో ఇండస్ట్రీ వర్గాలు సైలెంట్ అయిపోయారు.

ఎవరైనా దిల్ రాజుకు కౌంటర్ ఇస్తారా?  లేక `వారసుడు` తునీవు రిలీజ్ వరకు అదే సైలెన్స్ ని కంటిన్యూ చేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే అనే కామెంట్ లు సర్వత్రా వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.