అలా అని దిల్ రాజు కోరలేదు!

Mon Aug 15 2022 18:00:01 GMT+0530 (IST)

Dil Raju did not want that!

యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ సూపర్ నేచురల్ మిస్టిక్ థ్రిల్లర్ 'కార్తికేయ 2'. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లపై అభిషేక్ అగర్వాల్ టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ రెండు దఫాలుగా రిలీజ్ వాయిదా పడి ఫైనల్ గా ఆగస్టు 13న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.తొలి షోతో మంచి టాక్ ని సొంతం చేసుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ మూవీ సక్సెస్ పట్ల ఆనందం వ్యక్తం చేసిన నిఖిల్ సోమవారం పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. జూలై 22 ఆగస్టు 12న ముందు ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

అయితే దిల్ రాజ 'థాంక్యూ' కారణంగా ఈ మూవీ జూలై 22 నుంచి ఆగస్టు 12కు మారింది. ఆ తరువాత నితిన్ సినిమా వుందని ఆగస్టు 13కు మార్చారు. అయితే ఈ మూవీ రిలీజ్ పలు మార్లు వాయిదా పడటానికి నిర్మాత దిల్ రాజు అని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎలాంటి నిజం లేదని నిఖిల్ స్పష్టం చేశాడు.

దిల్ రాజు సునీల్ నారంగ్ వంటి డిస్ట్రిబ్యూటర్ల వల్లే నా సినిమా సేఫ్ గా రిలీజ్ అయిందని చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా జరిగిన ఓ ఫంక్షన్ లో వివరణ ఇచ్చారు. దిల్ రాజు మా సినిమాని వాయిదా వేసుకోమన్నారని నేను ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదన్నారు అంతే కాకుండా ఇప్పటి వరకు తాను ఇచ్చిన ఏ ఇంటర్వ్యూలోనూ అలా అని చెప్పలేదన్నారు నిఖిల్.

మా సినిమా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిందంటే కారణం దిల్ రాజు గారే.. అందుకు ఆయనకు థాంక్స్ అన్నారు.

ఇక ప్రొడ్యూసర్స్ గిల్డ్ కొత్త పాత్ర పోషిస్తోందని ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని ఈ సమయంలో ఇద్దరు హీరోల సినిమాలు క్లాష్ కావడం ఎందుకని 15 మంది సభ్యులు చెబితే ముందు మా సినిమాని వాయిదా వేశామని ఆ తరువాత కూడా మరో హీరో సినిమా వస్తోందని కోరితే మళ్లీ వాయిదా వేశామని ఇలా వాయిదాలు వేసుకుంటూ పోవాల్సి వస్తోందని బాధపడ్డానే కానీ తాను ఏ ఓక్కరినో ఉద్దేశించి మాట్లాడలేదన్నారు.