తొలిసారి తన స్టామినా చూపించి షాకిచ్చిన దిల్ రాజు

Sat Jan 15 2022 12:00:02 GMT+0530 (India Standard Time)

Dil Raju Stamina In Film Industry

ఒకప్పుడు నిర్మాత అంటే.. స్టార్ హీరోలు సైతం చాలా మర్యాదగా.. గౌరవంగా రియాక్టు అయ్యే పరిస్థితి. అలాంటి పరిస్థితులు పోయి.. హీరోలే రాజ్యాలు ఏలే పరిస్థితి. తర్వాత కొందరు దర్శకుల పుణ్యమా అని హీరోలు.. నిర్మాతలు సైతం వారికి తగ్గి ఉండటం మొదలైంది. మొత్తంగా అయితే హీరో.. లేదంటే డైరెక్టరే తప్పించి.. ఎంత పెద్ద సినిమా అయినా నిర్మాతలు కనిపించని పరిస్థితి. ఎక్కడిదాకానో ఎందుకు ఆర్ఆర్ఆర్ మూవీ సంగతే తీసుకోండి.. వంద కోట్లకు పైనే డబ్బులు పెట్టిన నిర్మాత దానయ్య ఎక్కడా కనిపించరు.. ఆ మాటకు వస్తే ఇద్దరు హీరోల కంటే కూడా బాహుబలి డైరెక్టర్ జక్కన్న అలియాస్ రాజమౌళినే కనిపిస్తుంటారు.ఇలాంటి రోజుల్లో నిర్మాతను ఒక సెలబ్రిటీగా తయారు చేసి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను క్రియేట్ చేసుకున్న నిర్మాత ఎవరైనా ఉన్నారంటే.. అది దిల్ రాజు మాత్రమేనని చెప్పాలి. తోపు నిర్మాణ సంస్థలు బోలెడు ఉన్నా.. దిల్ రాజు మాదిరి.. నిర్మాతగా శాసించేటోడు టాలీవుడ్ లో లేడనే చెప్పాలి. అలాంటి దిల్ రాజు తన సోదరుడి కొడుకు ఆశిష్ ను టాలీవుడ్ కు పరిచయం చేస్తూ.. రిలీజ్ చేసిన చిత్రం ‘రౌడీ బాయిస్’. సంక్రాంతి పండక్కి థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీ రిలీజ్ వేళ.. దిల్ రాజు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.

అన్ని పత్రికల్లో అని చెప్పట్లేదు కానీ.. సినిమా ప్రకటనలు బాగా పబ్లిష్ అయ్యే ఒక ప్రముఖ దినపత్రికలో రౌడీ బాయిస్ రిలీజ్ సందర్భంగా దిల్ రాజు అభిమానులుగా చెప్పే సినిమా ఇండస్ట్రీతో లింకు ఉన్న పలువురు పెద్ద ఎత్తునయాడ్స్ ఇవ్వటం.. అది కూడా ఏకంగా రెండున్నర.. మూడు పేజీల వరకు ఉండటం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా పెద్ద పెద్ద స్టార్ హీరోల వారసుల్ని పరిచయం చేసే మొదటి చిత్రానికి ఇంతటి గ్రాండ్ వెల్ కం ఇప్పటివరకు ఎవరికి జరిగింది లేదు. అలాంటిది ఒక ప్రొడ్యూసర్ సోదరుడి కొడుకును హీరోగా పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన మూవీకి.. ఇంత భారీగా.. అది కూడా పదుల సంఖ్యలో ఆయన్ను అభిమానించే వారు భారీగా యాడ్స్ ఇచ్చిన వైనం చూస్తే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజు స్టామినా ఏమిటో ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి. దాదాపుమూడు పేజీలు ఉన్న ప్రకటనల పేజీల్లో శాంపిల్ గా ఒకటి ఇప్పటికే చూసి ఉంటారు. దిల్ రాజా మజాకానా?