వారసుడు.. మొత్తానికి దిల్ రాజు సేఫ్!

Mon Jan 30 2023 16:00:01 GMT+0530 (India Standard Time)

Dil Raju Safe With Varasudu Collections

ఇళయదళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ వారిసు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో రిలీజ్ అయ్యింది.ఇక విజయ్ నుంచి చాలా కాలం తర్వాత ఈ తరహా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా వస్తూ ఉండటంతో కోలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక వంశీ పైడిపల్లి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ దిల్ రాజు లాంటి బడా నిర్మాత నుంచి వస్తున్న సినిమా కావడంతో తెలుగులో కూడా బజ్ క్రియేట్ చేసింది.

అయితే తెలుగులో కంటే రెండు రోజుల ముందుగా వారిసు మూవీ రిలీజ్ అయ్యింది. జనవరి 11న థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ మొదటి రోజు ఎవరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ భాగా కనెక్ట్ అవడంతో క్రమంగా కలెక్షన్స్ పెరిగాయి. దీంతో వేగంగానే ఈ మూవీ వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక తెలుగులో వాల్తేర్ వీరయ్య వీరసింహారెడ్డి లాంటి పెద్ద సినిమాలు ఉండటంతో దిల్ రాజు కాస్తా టెన్షన్ తోనే మూవీని రిలీజ్ చేశారు.

అయితే వీరసింహారెడ్డి టాక్ తగ్గడంతో ఫెస్టివల్ తర్వాత వారసుడు మూవీ కలెక్షన్స్ క్రమంగా పుంజుకున్నాయి. తెలుగులో 15 కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ తోనే రిలీజ్ అయిన వారసుడు మూవీ 16 రోజుల్లో  14.67 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఎవెన్ అందుకోవడానికి మరో 33 లక్షలు వస్తే సరిపోతుంది. ఇక తమిళంలో 139 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా 19 రోజుల్లో 276 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 200 క్లబ్ లో చేరిపోయింది.

షేర్ పరంగా చూసుకుంటే 140.80 కోట్లు కలెక్ట్ చేసింది దీంతో 1.80 కోట్ల ప్రాఫిట్ సినిమాకి వచ్చింది. దీంతో తమిళంలో ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలబడింది. అక్కడ డిస్టిబ్యూటర్స్ ఎవరూ నష్టపోలేదని తెలుస్తుంది.

ఇక తెలుగులో దిల్ రాజు సొంతంగా రిలీజ్ చేసుకోవడంతో సేఫ్ జోన్ లోనే బయట పడ్డాడు. ఇక శాటిలైట్ ఒటీటీ రైట్స్ తో కలుపుకుంటే సినిమాపై పెట్టిన పెట్టుబడి కంటే 100 కోట్ల వరకు దిల్ రాజు వారిసు మూవీతో అదనంగా సంపాదించినట్లే అవుతుందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.