దిల్ రాజు లక్ అలా ఉంది..!

Sat Apr 01 2023 10:47:23 GMT+0530 (India Standard Time)

Dil Raju Luck With Hit Films

డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్నారు. రీసెంట్ గా బలగం లాంటి ఓ చిన్న సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఆయన పేరుకి వారసులు నిర్మాతలని చెప్పినా వెనక ఫండింగ్ ఇచ్చింది ఆయనే అంటున్నారు. ఇక సినిమాను తన మార్క్ ప్రమోషనల్ యాస్పెక్ట్ తో ప్రీ రిలీజ్ బజ్ తో రిలీజ్ చేయగా అది కాస్త ఆడియన్స్ కి బాగా నచ్చేసి సూపర్ హిట్ చేశారు.బలగం నిర్మించింది దిల్ రాజు వారసులే అయినా దిల్ రాజు వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూట్ చేశారు. సినిమా వల్ల ఆయన బాగానే లాభ పడ్డాడని తెలుస్తుంది.

బలగం హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సినిమా ఓటీటీలో వచ్చాక కూడా థియేటర్ లో వసూళ్లు బాగానే ఉన్నాయి. ఈ ఏడాది బలగం లాంటి సినిమాతో దిల్ రాజు మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఇక లేటెస్ట్ గా నాని దసరా సినిమా నైజాం రైట్స్ కొనేసిన దిల్ రాజు రెండు రోజులకే లాభాల బాట పట్టినట్టు తెలుస్తుంది. దిల్ రాజు దసరా సినిమాను నైజాం రైట్స్ 9 కోట్లకు కొనేశారట.

సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంటే రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయినట్టు తెలుస్తుంది. సో ఇక నుంచి దసరాకు వచ్చే కలెక్షన్స్ అన్ని దిల్ రాజుకి ప్రాఫిట్స్ కింద లెక్కే.

అలా బలగం దసరా రెండు సినిమాలతో దిల్ రాజు సూపర్ ప్రాఫిట్స్ పొందుతున్నారు. అయితే ఈ రెండు సినిమాలు తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో రావడం విశేషం. బలగం కంప్లీట్ తెలంగాణా పల్లె వాతావరణం తో రాగా.. దసరా గోదావరి ఖని నేపథ్యంతో తెలంగాణా బ్యాక్ డ్రాప్ తోనే వచ్చింది. సినిమాలో నాని పర్ఫార్మెన్స్ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా దసరా నిలుస్తుందని చెప్పొచ్చు.

సినిమా మొదటిరోజే 38 కోట్ల గ్రాస్ తో అదరగొట్టగా వీకెండ్ ఈ సినిమా ఓ రేంజ్ వసూళ్లను రాబడుతుందని చెప్పొచ్చు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వచ్చిన ఈ దసరా సినిమాను ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమా విషయంలో నాని ముందునుండి సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పుడు సినిమా రిజల్ట్ నానికి ఫుల్ జోష్ ఇస్తుంది.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.