క్యారవాన్‌లా.... అదో టైమ్ వేస్ట్ పని అంటున్న దిల్ రాజు

Tue Nov 29 2022 14:44:19 GMT+0530 (India Standard Time)

Dil Raju Interesting Comments On Caravan Culture Actors

టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.  రెండు దశాబ్దాలుగా సక్సెస్‌ఫుల్‌గా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యే ఇమేజ్‌ను సంతరించుకున్న ఈ నిర్మాత ఇటీవల స్టార్ హీరోలు ఉపయోగిస్తున్న క్యారవాన్‌ల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. టాలీవుడ్‌లో ఇప్పుడు క్యారవాన్‌ల కల్చర్ బాగా పెరిగింది. ఈ క్యారవాన్‌ల గురించి ఇటీవల కాలంలో చాలా మంది పాత తరం నటులు కొంతమంది నిర్మాతలు కూడా పలు రకాల కామెంట్లూ చేస్తూ వచ్చారు.ఈ  క్యారవాన్ కల్చర్ గురించి తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఈ కల్చర్ పై  చర్చకు దారి తీస్తున్నాయి.  ఈ కల్చర్ వల్ల టైమ్ వేస్ట్ అవుతోందంటూ ఆయన చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.  

ఇటీవల దిల్ రాజు ఒక ఇంటర్యూలో తెలుగు స్టార్ హీరో హీరోయిన్ల ఉపయోగిస్తున్న క్యారవాన్‌ల గురించి ఆ కల్చర్ గురించి కీలకమైన కామెంట్లు చేశారు. ఇండస్ట్రీలో క్యారవాన్ వచ్చాక  టైమ్ వేస్ట్  ఎక్కువవుతోంది.  షాట్ రెడీ అయ్యాక హీరో హీరోయిన్లను పిలవాలంటే ముందుగా వారి అసిస్టెంట్లను పిలివాలి. వాళ్లు వెళ్లి యాక్టర్‌కు చెప్పిన తరువాత యాక్టర్లు వచ్చేసరికి 15 నిమిషాలు సమయం పడుతోంది.  వాళ్లు వచ్చాక షూటింగ్ ఏరియా క్లియర్ చేయడానికి ఇంకాస్త సమయం పడుతోంది.

ఇలా షూటింగ్ సమయంలో చాలా టైమ్ వేస్ట్ అవుతోంది. హీరో హీరోయిన్ల  క్యారవాన్ కల్చర్ వల్ల డిసిప్లైన్ కూడా పోయింది అంటూ దిల్ రాజు కామెంట్స్ చేశారు. ఈ కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ సినిమాలు తీస్తూ స్టార్ ప్రొడ్యూసర్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన తమిళ హీరో విజయ్‌తో వారసుడు అనే సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దిల్‌రాజు సన్నాహాలు చేస్తునారు.

అయితే సంక్రాంతి పండగ సందర్భంగా డైరెక్ట్ తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఇటీవల తెలుగు నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు పేరు ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతోంది. ఇప్పుడు ఆయన క్యారవాన్ కల్చర్ పైన చేసిన వ్యాఖ్యులు కూడా హాట్ టాపిక్గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.