Begin typing your search above and press return to search.

RC15.. మళ్లీ కన్ఫర్మ్‌ చేసిన దిల్‌ రాజు

By:  Tupaki Desk   |   14 Jan 2022 3:38 AM GMT
RC15.. మళ్లీ కన్ఫర్మ్‌ చేసిన దిల్‌ రాజు
X
తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులు మరియు ఉత్తరాది ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం RC15. సౌత్ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దిల్ రాజుకు నిర్మాతగా ఇది 50వ సినిమా. దాంతో ఆయన చాలా భారీగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. మూడవ షెడ్యూలు కూడా ప్రారంభం అవ్వాల్సి ఉన్నా రామ్ చరణ్ తన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ నిమిత్తం వాయిదా వేయడం జరిగింది.

ఫిబ్రవరి నెలలో శంకర్ చరణ్ ల చిత్రం మరో షెడ్యూలు కూడా ప్రారంభం కాబోతున్నట్లు గా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను 2023 వ సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. తాజాగా మరోసారి RC15 సినిమాకు సంబంధించిన విడుదల విషయమై నిర్మాత దిల్ రాజు ఒక ప్రకటన చేశాడు. దిల్ రాజు తన బ్యానర్ లో రూపొందిన రౌడీ బాయ్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ తో నిర్మించబోతున్న ఈ సినిమాకు సంబంధించిన విడుదల విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు. రామ్‌ చరణ్‌ మరియు శంకర్ల కాంబోలో రూపొందుతున్న సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి కచ్చితంగా విడుదల చేసి తీరుతామని అన్నట్లుగా దిల్ రాజు మెగా అభిమానులకు హామీ ఇచ్చాడు.

ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలు అందుకునే విధంగా సినిమాను భారీగా నిర్మిస్తున్న దిల్ రాజు కచ్చితంగా సంక్రాంతికి విడుదల చేస్తాం అంటూ మరోసారి విడుదల తేదీ కన్ఫామ్ చేయడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శంకర్ సినిమా అంటే కనీసం రెండు మూడు సంవత్సరాలు పడుతుందని టాక్ ఉంది. కానీ దిల్ రాజు తో ఒప్పందం మేరకు ఈ సంవత్సరం చివరి వరకు శంకర్ ఈ సినిమాను పూర్తి చేసేందుకు చకచకా షూటింగ్ పనులు జరుపుతున్నాడట. దిల్ రాజు పక్కా ప్లానింగ్ తో సినిమాను అనుకున్న టైంకి పూర్తి చేస్తాడనే నమ్మకం ను ప్రతి ఒక్కరి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్‌ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెల్సిందే.