రేయింబవళ్లు ఏంటో ఈ కష్టం పుష్పా?

Tue Nov 23 2021 21:00:01 GMT+0530 (IST)

Difficulty To Pushparaj

`పుష్ప: ది రైజ్` డిసెంబర్ 17న థియేట్రికల్ గా విడుదల కానుంది. ఇది బన్నీకి తొలి పాన్ ఇండియా సినిమా. ఈసారి హిందీ మార్కెట్ ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. అక్కడ పుష్పని అత్యంత భారీగా రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ చిత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. అల్లు అర్జున్- సుకుమార్ .. యూనిట్ మొత్తం షెడ్యూల్ ప్రకారం సినిమా విడుదలయ్యేలా చేయడానికి రేయింబవళ్లు శ్రమిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి అల్లు అర్జున్ డబ్బింగ్ చెబుతున్నారు. అతను నవంబర్ 28 నుండి తిరిగి సెట్స్ పైకి వెళతాడు. సమంతా కూడా పాల్గొనే ప్రత్యేక డ్యాన్స్ నంబర్ కోసం షూట్ చేస్తాడు. ఆ తర్వాత మళ్లీ డబ్బింగ్ స్టూడియోకి వస్తాడు. దీనికోసం రౌండ్ ది క్లాక్ పని చేస్తున్నాడు.డబ్బింగ్ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ ప్రచార కార్యక్రమంలో చురుకుగా పాల్గొనవలసి ఉంటుంది. దేశవ్యాప్తంగా జరగనున్న ప్రత్యేక కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు. ఇండివిడ్యువల్ గా మీడియాతో ఇంటరాక్ట్ కావాల్సి ఉంటుంది. మలయాళం- హిందీ-తమిళంలోనూ అతడు ప్రచారం చేయాల్సి ఉంటుంది. నిజంగా `పుష్ప` కోసం రౌండ్ ది క్లాక్ పని చేస్తున్నాడు.

`పుష్ప` చిత్రంలో ఫహద్ ఫాజిల్ కాప్ పాత్రలో నటిస్తుండగా.. రష్మిక మందన శ్రీవల్లి పాత్రలో నటిస్తోంది. రష్మిక లుక్ సహా ఫహద్ లుక్ కి ఇప్పటికే చక్కని స్పందన వచ్చింది. పుష్పరాజ్ అనే గంధపు చక్కల స్మగ్లర్ గా అల్లు అర్జున్ నటిస్తున్నారు.