ఆస్కార్ కొనేశారా.. కడుపుమంట ఇలా చూపిస్తున్నారు..!

Fri Mar 17 2023 10:44:38 GMT+0530 (India Standard Time)

Did you buy an Oscar?

తెలుగు సినిమా పాట ఆస్కార్ వేదిక మీద ప్రదర్శించబడటం.. సౌత్ సినిమాకు ముఖ్యంగా తెలుగు సినిమాకు అకాడమీ అవార్డుల్లో ప్రాధాన్యత కలిగించడం చూసి బాలీవుడ్ జనాలు కుళ్లుకుంటున్నారు. ఆస్కార్ వేదిక మీద ఇండియన్ సాంగ్ కి డ్యాన్స్ అన్నది ఎంత గొప్ప విషయం దాన్ని.. ఆ వేడుకని బాలీవుడ్ మీడియా జస్ట్ ఏదో మొక్కుబడిగా మాత్రమే కవరేజ్ చేసింది. తెలుగు సినిమాకు ఆస్కార్ రావడంపై బాలీవుడ్ జనాలను నిద్రపోనివ్వడం లేదు.అందుకే ఆస్కార్ వచ్చినా సరే ఇంతవరకు ఎవరు ఆర్.ఆర్.ఆర్ గురించి స్పందించలేదు. దానికితోడు ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావడం పట్ల విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ మేకప్ మెన్ షాన్ ముట్టతిల్ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావడంపై సంచలన కామెంట్స్ చేశాడు. ఇన్నాళ్లు ఇండియాలో అవార్డులను కొంటారని అనుకునే వాళ్లమని.. ఆస్కార్ అవార్డ్ ని కూడా కొనొచ్చని నాటు నాటు సాంగ్ కి వచ్చిన అవార్డ్ చూస్తే తెలుస్తుందని అన్నారు. ఈ కామెంట్స్ వెనక వారి కడుపు మంట ఏంటో అర్ధమవుతుంది.

బాలీవుడ్ మీడియా ఇన్నర్ ఫీలింగ్ కూడా ఇదే అని చెప్పొచ్చు. ఒకవేళ ఆస్కార్ ని కొనే అవకాశం ఉంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ కి అది ఎందుకు చేత కాలేదు.. అసలు ఇలాంటి చీప్ కామెంట్స్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలి కదా అని నెటిజెన్లు అతనిపై రివర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇండియన్ సినిమాకు వచ్చిన ఈ అవార్డ్ ని తెచ్చినందుకు ప్రోత్సహించడం మానేసి ఆస్కార్ ని కూడా కొనేయొచ్చు అనే విచిత్ర కామెంట్స్ అందరిని షాక్ అయ్యేలా చేస్తున్నాయి.

అతను మాత్రమే కాదు బెంగాలి యాక్ట్రెస్ అనన్యా ఛటర్జీ కూడా నాటు నాటు సాంగ్ లో అంత విషయం ఏమి లేదని.. ఆ పాటని చూసి గర్వపడాల్సిన అవసరం ఏమీ లేదని అన్నారు. ఇండియన్ సినిమా సాంగ్ ఆస్కార్ వేదిక మీద ప్రదర్శించబడి అందరి చేత సూపర్ అనిపించుకుంటే ఈమెకు మాత్రం ఆ సాంగ్ అంత గొప్పగా అనిపించకపోవడం విడ్డూరంగా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.