Begin typing your search above and press return to search.

'లవ్ స్టోరీ' డైరెక్టర్ అదే సెంటిమెంట్ నమ్ముకున్నాడా..?

By:  Tupaki Desk   |   1 March 2021 7:30 AM GMT
లవ్ స్టోరీ డైరెక్టర్ అదే సెంటిమెంట్ నమ్ముకున్నాడా..?
X
నేచురల్ బ్యూటీ సాయిపల్లవి - అక్కినేని నాగచైతన్య జంటగా నటిస్తున్న సినిమా "లవ్ స్టోరీ". క్లాస్ లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే సాయిపల్లవి, నాగచైతన్య జంటగా నటిస్తున్న ఫస్ట్ సినిమా ఇది. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ క్రేజీ సినిమాపై భారీ అంచనాలతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమాలోని కొత్తపాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. "సారంగదరియా " అంటూ సాగే ఈ హుషారైన జానపదపాట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాలోని హీరోయిన్ సాయిపల్లవి టాలెంట్ గురించి అందరికి తెలిసిందే. ఆమె అద్భుతమైన నటనతో పాటు డాన్స్ కూడా ఇరగదీస్తోంది. ఈ సినిమాలోని పాటలకు సాయిపల్లవితో డైరెక్టర్ ఫుల్ డాన్స్ చేయిస్తున్నాడని టాక్. ఏప్రిల్ 16న సినిమా విడుదల కాబోతుంది.

తెలుగులో ఫస్ట్ సినిమా 'ఫిదా'తోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది సాయిపల్లవి. అయితే ఆ సినిమాను కూడా శేఖర్ కమ్ములనే రూపొందించాడు. ఆ సినిమాలో సాయిపల్లవి తెలంగాణయాసలో మాట్లాడి ఫిదా చేసింది. అయితే డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈసారి కూడా సాయిపల్లవినే నమ్ముకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ఏంటంటే.. ఫిదా సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం సాయిపల్లవికే దక్కింది. ఆ తర్వాతే డైరెక్టర్, హీరోల పేర్లు వినిపించాయి.

ఇప్పుడు లవ్ స్టోరీ విషయంలో కూడా డైరెక్టర్ ఆమెనే నమ్ముకున్నాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ఈ సినిమాలో కూడా మాక్సిమం సాయిపల్లవినే అన్నింట్లో కవర్ చేశారట. సాంగ్స్, డాన్స్ విషయంలో ఆమె హైలైట్ అవుతోంది. సారంగదరియా పాటలో కూడా మొత్తం సాయిపల్లవి దుమ్ముదులుపుతోంది. ఈ పాటతోనే మంచి ఓపెనింగ్స్ వస్తాయనే ఆశతో ఉన్నారట మేకర్స్. మరి అంతటా హీరోయిన్ పేరు వినిపిస్తే హీరోకు క్రెడిట్ ఎక్కడుందని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. చూడాలి మరి నాగచైతన్య ఈ సినిమాకు ప్లస్ అవుతాడో లేదో అంటున్నాయి సినీవర్గాలు!