పవర్ స్టార్ మూవీ నుండి ఆ హీరోయిన్ కూడా అవుట్ అయ్యిందా..??

Fri Mar 05 2021 09:00:02 GMT+0530 (IST)

Did that heroine also get out of the Power Star movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మలయాళీ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఆఫీసియల్ గా ప్రకటించిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో జనవరి నుండి మొదలవుతుందని తెలిపారు మేకర్స్. ప్రస్తుతం ఈ రీమేక్ సినిమాలో నటిస్తున్న అందరూ మెయిన్ హీరోహీరోయిన్స్ బిజీగా ఉన్నవాళ్లే. పవన్ ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా కంప్లీట్ చేసి విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హిస్టోరికల్ మూవీ చేస్తున్నాడు. అయితే అతి త్వరలోనే ఈ సినిమా కంప్లీట్ కానుందట. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుందని టాక్. ఇదిలా ఉండగా.. అయ్యప్పనుమ్ కోషియం మూవీ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఏకే' ఈ రీమేక్ మూవీ రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్ రెడీ అవుతోంది.పవన్ తో పాటు హీరో రానా కూడా ప్రధానపాత్రలో నటిస్తున్నాడు. అయితే పవన్ సరసన సాయిపల్లవి నటించాల్సి ఉండగా.. ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాలేకనో మరి ఏ విధంగానో సినిమా నుండి తప్పుకుందని టాక్ వచ్చింది. మొత్తానికి సాయిపల్లవి ఈ సినిమాలో లేదని భావిస్తున్నారు ఫ్యాన్స్. ఇంతలో మరో వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. అదేంటంటే ఈ సినిమాలో రానా భార్యగా ఐశ్వర్యరాజేష్ కనిపించనుందని తెలిసిందే. ఆమె పేరు అధికారికంగా కూడా ప్రకటించారు మేకర్స్. కానీ తాజాగా ఐశ్వర్య కూడా ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఏమైయ్యుంటుంది అని అందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఐశ్వర్య కూడా డేట్స్ ఖాళీ లేకనే ప్రాజెక్ట్ నుండి బయటికి వెళ్లి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అలాగే ఈ సినిమాలో ఐశ్వర్య పాత్ర కూడా ఎక్కువ నిడివి ఉండదనే విషయం తెలిసి ఇలా చేసిందేమో అంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఐశ్వర్య ప్రస్తుతం అయితే తెలుగు తమిళ ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలు కలిగి ఉందట. మరి వీరి ప్లేస్ లో ఎవరు వస్తారో చూడాలి.