సినిమాల్లేకపోయినా ఫర్లేదు కానీ అలాంటివి చేయడు

Sun Oct 25 2020 20:00:40 GMT+0530 (IST)

Did Trivikram make an offer to Tarun ?

యంగ్ హీరో తరుణ్ కెరీర్ డైలమా గురించి తెలిసిందే. ఏ ఇతర యువహీరోల కెరీర్ జర్నీలో లేనంత డైలమా తరుణ్ ఎదుర్కొన్నాడు. వ్యక్తిగత.. వృత్తిగతమైన కన్ఫ్యూజన్ కూడా నిరంతరం అభిమానుల్లో చర్చకు వస్తుంటుంది. గొప్ప ప్రతిభావంతుడే అయినా అతడు రేస్ లో వెనకబడడానికి మల్టిపుల్ కారణాల్ని విశ్లేషిస్తుంటారు. అయినా తరుణ్ ఇంకా కంబ్యాక్ అయ్యేందుకు చేయని ప్రయత్నం లేదు.ఓవైపు ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నా.. నటుడిగా కంబ్యాక్  అయ్యే అవకాశం కోసం అతడు చాలా కాలంగా వేచి చూస్తున్నాడు. అయితే సరిగ్గా అలాంటి టైమ్ లోనే అతడికి త్రివిక్రమ్ రూపంలో ఓ అవకాశం దక్కిందట. 2020 బ్లాక్ బస్టర్ మూవీ `అల వైకుంఠపురములో` చిత్రంలో సుశాంత్ కి ఆఫర్ చేసిన పాత్రను తొలుత తరుణ్ కే ఆఫర్ చేశారట మాయావి. కానీ అందులో నటించేందుకు తరుణ్ ఆసక్తి చూపించలేదని తెలిసింది.

ఇక సుశాంత్ నటించిన ఆ పాత్ర ప్రభావం కూడా ఏమంత లేదు. అదేమీ అంత ఆసక్తికరమైన నటించేందుకు ఆస్కారం ఉన్న పాత్ర కానేకాదు. అయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేందుకు ఏమాత్రం ఆసక్తిగా లేనని తరుణ్ చెప్పకనే చెప్పేసాడు ఆ అవకాశం వదులుకుని... అయితే అతడు పూర్తి స్థాయి హీరోగా నటించే సినిమాకి త్రివిక్రమ్ ఛాన్సిచ్చేదెపుడు? అన్నది చూడాలి. తరుణ్ డెబ్యూ బ్లాక్ బస్టర్ నువ్వే కావాలికి త్రివిక్రమ్ రచయిత. అలాగే తరుణ్ నటించిన `నువ్వే నువ్వే` త్రివిక్రమ్ కి దర్శకుడిగా తొలి సినిమా. అలాంటి అనుబంధం ఆ ఇద్దరి మధ్యా ఉంది కాబట్టి మునుముందు కలిసి పని చేసే అవకాశం ఉందేమో చూడాలి.