భన్సాలీతో విభేదానికి షాకిచ్చే కారణం

Tue Sep 17 2019 07:00:02 GMT+0530 (IST)

Did Salman Khan walk out of Sanjay Leela Bhansali Inshallah to avoid kissing Alia Bhatt? Here the tr

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్- సంజయ్ లీలా భన్సాలీ కలయికలో `ఇన్హాల్లా` సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అలియాభట్ ని కథానాయికగా ఫైనల్ చేశారు. అంతా రెడీ అనుకుంటుండగానే.. సినిమా ఆగిపోవడం అభిమానులకు షాకిచ్చింది. దాని వెనక రకరకాల కారణాలు వినిపించాయి.  `హమ్ దిల్ దేచుకే సనమ్` కాంబినేషన్ తిరిగి రిపీటవుతోందని ఆనందించిన అభిమానులకు అది అశనిపాతమే అయ్యింది. తాజాగా అసలు సిసలు కారణమేంటో రివీలైంది.దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ- సల్మాన్ ల మధ్య విభేధాల కారణంగానే `ఇన్ హాల్లా` అర్థాంతరంగా ఆగిపోయిందని అందరికీ తెలుసు. కానీ ఆ విభేధం ఏంటో ఎవరికీ క్లారిటీ లేదు. సల్మాన్ అర్థాంతరంగా తప్పుకోవడానికి అసలు కారణం వేరే వుంది. కథ డిమాండ్ మేరకు సినిమాలో సల్మాన్ ఖాన్- అలియాల మధ్య లిప్ లాక్ సన్నివేశాలున్నాయట. అయితే వాటిని తొలిగించి స్క్రిప్ట్ లో మార్పులు చేయమని సల్మాన్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి చెప్పాడని.. అయితే కథని మార్చడానికి సంజయ్ అంగీకరించలేదని - ఆ కారణంగానే సల్మాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని తెలిసింది.

దీంతో సంజయ్ లీలా భన్సాలీ  మరో హీరో కోసం అన్వేషణ మొదలుపెట్టినట్టు చెబుతున్నారు. షారూక్ కూడా అంగీకరించకపోవడంతో హృతిక్ రోషన్ ని భన్సాలీ సంప్రదించారని వార్తలొస్తున్నాయి. భన్సాలీ- హృతిక్ జోడీ ఇదివరకూ గుజారిష్ చిత్రానికి కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా వుంటే హీరోయిన్ అలియాభట్ `సడక్` చిత్ర షూటింగ్ లో బిజీగా మారిపోయింది. మహేష్ భట్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.