ఆ నిర్మాత మీద బ్యానర్ మీద ఈ గుసగుసలేంటబ్బా

Sun Oct 18 2020 14:00:01 GMT+0530 (IST)

Did Producer go ahead blindly believing that something would happen?

సినిమా జయాపజయాలకు సవాలక్ష కారణాలుంటాయి. అన్నీ కుదిరినా చివరి నిమిషంలో ఏదో ఒకటి తేడా కొడితే అంతా రివర్సయిపోతుంది. ఇది ఒక్క సినిమా రంగానికి ప్రత్యేకం. అందుకే సినిమా చేసే ముందే నిర్మాతలు అన్ని రిస్కులకు రెడీ అయ్యి చేస్తుంటారు. ఇక్కడికి వచ్చే ముందే పెట్టుబడుల్ని ప్రయోగం కిందే చూస్తారు. 5 శాతం సక్సెస్ ఉండే ఇండస్ట్రీలో ఏదీ వెనక్కి రాదని.. ఒకవేళ లక్కు చిక్కి బంపర్ హిట్టు కొట్టి నిజాయితీగా డబ్బు వెనక్కి వస్తే లాభాల పంట పండితే అప్పుడు కానీ హమ్మయ్య అనుకోరనేది  కూడా అందరికీ తెలుసిన నిజం.లాభాలు రాకపోయినా... హిట్ అనే టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఇప్పుడు ఓ అగ్ర నిర్మాణ సంస్థ వరుస సినిమాలకు సన్నాహకాల్లో ఉందట. ఇంతకీ ఏదా నిర్మాణ సంస్థ అంటే.. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్. ఈ బ్యానర్ లో ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నారు. రాకరాక వచ్చిన హిట్ బొనాంజాని ఎలాగైనా నిలబెట్టుకోవాలని నిర్మాత అనిల్ సుంకర ప్లాన్ చేసుకుంటున్నాడట.

అందుకే కథల సెలెక్షన్ తాను ఎగ్రీమెంట్స్ వేసుకున్న హీరోలకే వదిలేస్తున్నాడట..! ఇప్పుడు మహాసముద్రం విషయంలో ఈ నిర్మాత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లుగా తెలిసింది. ఆ తరువాత సాయిధరమ్ తేజ్ తో చేయబోయే సినిమా విషయంలో కూడా కథ హీరో టీమ్ నే తెచ్చుకోమని చెప్పినట్లుగా సమాచారం. అన్నట్టు అనీల్ సుంకర ఇంతకుముందు దర్శకత్వం కూడా చేశారు. స్క్రిప్టు సహా ప్రతిదీ తానే పర్యవేక్షించి చేసిన చాలా ప్రయత్నాలు విఫలమయ్యాక ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారా? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.