నిజంగా ప్రభాస్ 'ధూమ్-4' ఛాన్స్ వదులుకున్నాడా..??

Wed Jun 16 2021 09:00:01 GMT+0530 (India Standard Time)

Did Prabhas really give up Dhoom 4 chance

బాహుబలి సినిమాలతో టాలీవుడ్ ప్రభాస్ కాస్తా ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత ప్రభాస్ నుండి సాహో అనే యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదికూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. అలాగే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నటువంటి అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. అయితే ఆల్రెడీ రాధేశ్యామ్ అనే పీరియడిక్ లవ్ స్టోరీతో మూవీ కంప్లీట్ చేసాడు. ప్రస్తుతం మైథిలాజికల్ ఫిల్మ్ ఆదిపురుష్ తో పాటు మాస్ మాఫియా యాక్షన్ సలార్ మూవీస్ షూటింగ్ దశలో ఉన్నాయి.అయితే ప్రభాస్ నిజానికి బాలీవుడ్ డెబ్యూ ధూమ్ యాక్షన్ సిరీస్ ఫ్రాంచైజ్ లో జరగాల్సింది అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈసారి ధూమ్ 4లో ప్రభాస్ కనిపించనున్నట్లు పుకార్లు వచ్చాయి. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్యచోప్రా ధూమ్ 4లో విలన్ రోల్ కోసం సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే ఈ ధూమ్ సిరీస్ ద్వారానే జాన్ అబ్రహం - హృతిక్ రోషన్ - అమీర్ ఖాన్ విలన్ రోల్స్ చేసి సూపర్ క్రేజ్ అందుకున్నారు. ఈ ఫ్రాంచైజిలో హీరోలకంటే విలన్ క్యారెక్టర్స్ హీరోస్ రేంజిలో ఉంటాయి. బాహుబలి టైంలోనే ప్రభాస్ ఒడ్డుపొడుగు బాడీ చూసి ఛాన్స్ ఇవ్వడానికి సంప్రదించినట్లు టాక్ నడిచింది. కానీ ఆ వార్తల్లో నిజం లేదని అప్పట్లో ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం అలాంటి ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో డెబ్యూ చేయబోతుండటంతో యష్ రాజ్ ఫిలిమ్స్ వారు ప్రభాస్ గురించి నిర్ణయం మానుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఓ మైథలాజికల్ సినిమాతో పరిచయమైన వెంటనే ఓ ధూమ్ 4 యాక్షన్ మూవీ అంటే ఆదరిస్తారో లేదో అనే అనుమానంతో ప్రభాస్ విషయంలో ఆలోచన మార్చుకున్నట్లు సమాచారం. చూడాలి మరి ప్రస్తుతం ధూమ్ 4 విలన్ రోల్ కోసం యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ను ఎంపిక చేసే విధంగా ఆదిత్యచోప్రా ఆలోచనలో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఆదిపురుష్ - సలార్ మూవీస్ తర్వాత ప్రభాస్ సై-ఫై మూవీ చేయనున్నాడు.