Begin typing your search above and press return to search.

పూజాహెగ్డేకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా..?

By:  Tupaki Desk   |   2 April 2020 3:30 AM GMT
పూజాహెగ్డేకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా..?
X
కరోనా వైరస్ వల్ల ప్రపంచం గడగడలాడుతోంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకి సెలబ్రిటీలందరూ అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు. కొందరు ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తుంటే మరికొందరు స్వయంగా నిత్యవసర వస్తువులను పేదవారికి ఇచ్చి తమ ఉదాసీనతను చాటుకుంటున్నారు. టాలీవుడ్‌లోని సెలబ్రిటీలు ఈ విషయంలో ఒకడుగు ముందే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్‌లో విరాళాలు ప్రకటించిన వారిలో కేవలం హీరోలే ఉండటం, హీరోయిన్లు లేకపోవడం కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది.

ముంబై నుండి దిగుమతి అయిన చాలా మంది హీరోయిన్స్ మన టాలీవుడ్ లో పాగా వేసుకుని ఉన్నారు. ఒక సినిమాకి లక్షల నుండి కోట్ల దాకా డిమాండ్ చేసే వీళ్లు ఇలాంటి సమయంలో సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. వరుస అవకాశాల తో దూసుకుపోతున్న పూజాహెగ్డే లాంటి స్టార్ హీరోయిన్ కూడా స్పందించక పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అమ్మడు సినిమాకి కోటి నుండి రెండు కోట్ల దాకా వసూలు చేస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి సామాజిక కార్యక్రమాలకి ఎందుకు స్పందించదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. హీరోయిన్లలో ప్రణీత, లావణ్య త్రిపాఠీలు మాత్రమే విరాళాలు అందించారు. ఈ విపత్కర పరిస్థితులలో తన వంతు సాయం అందించడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం ప్రణీత చేతుల్లో సరైన సినిమా లేకపోయినప్పటికీ తన వంతుగా రూ. లక్ష ప్రకటించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. తర్వాత కరోనా పై స్పందించిన మరో హీరోయిన్ లావణ్య త్రిపాఠి చిరంజీవి తలపెట్టిన కరోనా క్రైసిస్ ఛారిటీకి (సీసీసీ) తన వంతు సామాజిక బాధ్యతగా లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించింది. అయితే కొంతమంది సహాయం చేసినా అది పబ్లిసిటీ చేసుకోడానికి ఇష్టపడరు. మరి వీరందరూ విరాళాలు ఇచ్చి కూడా బయటకి చెప్పడం లేదేమో. ఏదేమైనా తమ సామాజిక బాధ్యత నెరవేర్చుకున్న హీరోయిన్స్ ను అభినందించాల్సిందే.