Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ అవన్నీ బలవంతంగా చేశాడా..?

By:  Tupaki Desk   |   28 Jan 2023 11:08 AM GMT
పవన్ కళ్యాణ్ అవన్నీ బలవంతంగా చేశాడా..?
X
టాలీవుడ్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం ఒక హీరోగానే కాదు పార్టీ అధినేతగా కూడా రాజకీయ ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు. జనసేన పార్టీ రాబోయే ఎలక్షన్ లో తన ముద్ర చూపించాలని చూస్తుంది. ఇదిలా ఉంటే పవన్ ఇప్పుడు అన్ని మాధ్యమాలను వాడేస్తున్నారు. లేటెస్ట్ గా ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 2లో కూడా దర్శనమిచ్చారు పవన్. బాలకృష్ణ హోస్ట్ గా సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ గెస్ట్ గా అటెండ్ అవ్వడం ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇచ్చింది.

ఈ స్పెషల్ చిట్ చాట్ లో పవన్ తనని ఇంట్లో కొన్నిటికి బలవంతంగా ఇరికించారని చెప్పారు. అన్నయ్య షూటింగ్ కి వెళ్తే పిల్లల బాధ్యత తను చూసుకోవాల్సి వచ్చిందని. చరణ్ తో సహా అందరు పిల్లలని తానే ఆడించానని అన్నారు పవన్.

అయితే ఇవన్ని తను చేయాల్సి వచ్చింది కానీ తనకు ఇష్టం లేదు అన్నట్టుగా సరదాగా చెప్పారు పవన్ కళ్యాణ్. అప్పుడు అన్నయ్య బిజీగా ఉండటం వల్ల అలా చేశానని.. నాగబాబు కూడా అప్పుడు నిర్మాతగా బిజీగా ఉండటం వల్ల తను బుక్ అయ్యానని అన్నారు. మొత్తానికి అన్నయ్య పిల్లల బాధ్యత తన మీద పెట్టిన విషయాన్ని పవన్ అన్ స్టాపబుల్ లో షేర్ చేసుకున్నారు.

ఇక ఇదే చిట్ చాట్ లో పవన్ మూడు పెళ్లిళ్ల ప్రస్థావన కూడా వచ్చింది. దానికి పవన్ సమాధానం కూడా చెప్పారు. ఇక మనం ఇద్దరం ఫస్ట్ టైం ఎక్కడ కలిశామో తెలుసా అంటూ పవన్ సుస్వాగతం సినిమా షూటింగ్ లో బాలకృష్ణ కూడా ఏదో షూటింగ్ లో ఉండగా ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు.

అప్పుడు తాను చాలా యంగ్ గా ఉన్నా కదా అని బాలయ్య అంటే ఇప్పుడు కూడా అని అంటాడు పవన్. మొత్తానికి అటు పవర్ స్టార్ ఫ్యాన్స్.. ఇటు నందమూరి అభిమానులు ఇద్దరు ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ త్వరలో రాబోతుంది.

ఈ ఎపిసోడ్ లో సాయి ధరం తేజ్ కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు. ఇక పవన్ గురించి మరింత సమాచారం కోసం బాలకృష్ణ మరోసారి చరణ్ కి ఫోన్ చేసి మాట్లాడారు. మొన్న ప్రభాస్ వచ్చినప్పుడు కూడా చరణ్ కి ఫోన్ చేసి ప్రభాస్ రాణి గురించి అడిగిన విషయం తెలిసిందే. మొత్తానికి బాలకృష్ణ, పవన్ అన్ స్టాపబుల్ ప్రోమో తోనే సూపర్ అనిపించింది. ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.