Begin typing your search above and press return to search.
ఖాన్ ఇంటిపేరు వదిలేసి మలైకా తప్పు చేసిందా?
By: Tupaki Desk | 19 March 2023 10:10 AMబాలీవుడ్ ఐటం బాంబ్ మలైకా ఆరోరా ధాంపత్య జీవితం గురించి తెలిసిందే. ముందుగా ఆర్భాజ్ ఖాన్-మలైకా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ప్రేమకు కానుకగా అర్హన్ ఖాన్ ఉన్నాడు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆ జంట కొన్నాళ్లకే విడిపోయింది. అటుపై ఎవరి స్వేచ్ఛా జీవితం వారు కోరుకున్నారు. ఈ క్రమంలో మలైకా అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం సాగింది. ఇద్దరు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నట్లు నెట్టింట ఎప్పటికప్పుడు ప్రచారం సాగుతోంది.
ఈ క్రమంలో మలైకా-అర్జున్ చాలా విమర్శలే ఎదుర్కున్నారు. అయినా తమ స్వేచ్ఛకి మిగతా ప్రపంచం పనిలేదని ఆ జంట ముందుకు సాగిపోతుంది. అయితే అర్బాజ్ ఖాన్ ని పెళ్లాడిన తర్వాత మలైకా ఖాన్ ఇంట కోడలిగా అడుగు పెట్టింది. కొన్నా ళ్ల పాటు ఖాన్ ఇంట కొడలిగా ఉంది. ఆ కుటుంబంతో కలిసి ఉన్నంత కాలం మలైకా కీర్తి మర్యాదలు ఎంతో ప్రత్యేకంగా ఉండేవి. అయినా సరే విడాకుల తర్వాత ఖాన్ ఇంటి పేరును తనకు తానుగానే తొలగించుకుంది.
ఖాన్ కోడలు అనే ట్యాగ్ తనకి వద్దని తన కాళ్లపై తాను నిలబడాలని సొంతంగానే నెట్టుకొచ్చింది. అయితే ఖాన్ ఇంటి పేరు వదిలేస్తే సమాజంలో ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందనేది? అమెకి ముందే తెలుసు. అయినా సరే ధైర్యంగా ఖాన్ ఇంటి పేరును తన పేరు పక్కన తొలగించి జీవితాన్ని సాగిస్తుంది. తాజాగా ఓఇంటర్వ్యూలో ఇదే విషయంపై చర్చ సాగగా ఆసక్తికరంగా మాట్లాడింది.
'ఆ ఇంటిపేరు యొక్క కీర్తి పై ఆధారపడకూడదని విడాలకు రోజునే నిర్ణయించుకున్నా. ఇంటిపేరుతో సంబంధం లేకుండా నాకు నేనుగా ఎదగాలనే ఆత్మ విశ్వాసం మరింత పెరిగింది విడాకుల తర్వాతే .కష్టపడి పనిచేయాలని ప్రతీ రోజు అనుకుంటా. ఖాన్ ఇంటి పేరును వదిలివేయడం నాలో ఆత్మవిశ్వాసం - జీవితంలో ఎలాంటి సంఘటనైనా తేలికగా తీసుకోగలను అనిపించింది.
నేను ఇంటిపేరును వదులుకుని పెద్ద తప్పు చేస్తున్నాను అని చాలా మంది చెప్పారు. 'ఇంటిపేరు కి ఎంత వెయిటేజీ కలిగి ఉందో మీకు తెలియదు? అని సలహాలు ఇచ్చారు. కానీ అవన్ని పట్టించుకోలేదు. ఇప్పటికీ నా మాజీ అత్తమామలపై నాకు అంతే ప్రేమ-గౌరవం ఉంది. ఇంటిపేరు తొలగించుకున్నంత మాత్రాన వాళ్లంటే అగౌర్వం ఉందని కాదు. నేను వాళ్లతో ఉన్నంత కాలంలో ఎంతో ప్రేమగా చూసు కున్నారు. నేను ఏంటో వాళ్లకి తెలసు.. వాళ్లు ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు నా ఇంటిపేరు ఏది అని అడిగితే నా తల్లిదండ్రుల ఇచ్చిన ఇంటి పేరు ఉందని ఎక్కడైనా చెప్పగలను' అని అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.