Begin typing your search above and press return to search.

దిల్‌రాజు దిద్దుబాట మొద‌లు పెట్టాడా?

By:  Tupaki Desk   |   26 Jan 2023 8:00 AM
దిల్‌రాజు దిద్దుబాట మొద‌లు పెట్టాడా?
X
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు దిద్దుబాట మొద‌లు పెట్టాడా? అంటే టాలీవుడ్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. దిల్ రాజు.. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో తిరుగులేని నిర్మాత‌. నితిన్ నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర‌కు ఇండ‌స్ట్రీలో వున్న స్టార్ హీరోల‌తో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాల‌ని నిర్మించి వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుని స‌క్సెస్ కి కేరాఫ్ అడ్ర‌స్ అనిపించుకున్నారు. టాలీవుడ్ లో వున్న అగ్ర నిర్మాత‌ల‌లో పేరున్న నిర్మాత‌గా నిలిచారు.

గ‌త కొంత కాలంగా సినిమాల నిర్మాణంపైనే ప్ర‌త్యేక దృష్టి పెట్టిన దిల్ రాజు వివాదాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చారు. నిర్మాత‌గానే కాకుండా డిస్ట్రిబ్యూట‌ర్ గానూ నైజాం, వైజాగ్ ఏరియాల్లో త‌న‌దైన ముద్ర‌వేసి డిస్ట్రిబ్యూట‌ర్ గానూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే గ‌త కొన్ని నెల‌లుగా దిల్ రాజు ఏం మాట్లాడినా వివాదం అవుతూ వ‌చ్చింది. షూటింగ్ ల బంద్ సంద‌ర్భంగా ఆయ‌న 'వార‌సుడు' షూటింగ్ విష‌యంలో వ్య‌వ‌హ‌రించిన తీరుపై విమ‌ర్శ‌లు వెలల్లు వెత్తాయి.

ఆ త‌రువాత 'వారీసు' రిలీజ్ స‌మ‌యంలో విజ‌య్ త‌మిళ‌నాడులో అజిత్ ని మించిన స్థార్ అంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై పెద్ద దుమార‌మే రేగింది. అంతే కాకుండా సంక్రాంతి బ‌రిలో తెలుగు సినిమాల‌కు పోటీగా డ‌బ్బింగ్ సినిమాని దిల్‌రాజు రిలీజ్ చేస్తున్నాడ‌ని, ఇందు కోసం భారీ సంఖ్య‌లో థియేట‌ర్ల‌ని బ్లాక్ చేసి పెట్టుకున్నాడంటూ ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై నిర్మాత‌ల మండ‌లి ఓపెన్ లెట‌ర్ రిలీజ్ చేయ‌డం.. దానిపై త‌మిళ నిర్మాత‌లు మండిప‌డ‌టంతో విష‌యం సీరియ‌స్ అయింది.

ఇన్ని వివాదాల మ‌ధ్య వాల్తేరు వీర‌య్య‌, వీర సింహారెడ్డి ల‌కు లైన్ క్లియ‌ర్ చేస్తూ దిల్‌రాజు 'వార‌సుడు' ని తెలుగులో జ‌న‌వ‌రి 14కు పోస్ట్ పోన్ చేయ‌డం తెలిసిందే. త‌మిళంలో జ‌న‌వ‌రి 11నే విడుద‌ల చేసిన దిల్ రాజు తెలుగు సినిమాల ఒత్తిడి కార‌ణంగా మ‌న‌సు మార్చుకుని 14న విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్ సంద‌ర్భంగా 'వార‌సుడు' విజ‌యంపై చాలా చెప్పుకొచ్చారు. ఈ సినిమా స‌క్సెస్ విష‌యంలో చాలా కాన్పిడెంట్ గా క‌నిపించారు.

అయితే ఫ‌లితం మాత్రం బెడిసికొట్టింది. త‌మిళంలో హిట్ అనిపించుకున్నా తెలుగులో మాత్రం 'వార‌సుడు' ఫ్లాప్ గా నిలిచి దిల్ రాజు అంచ‌నా త‌ప్ప‌ని నిరూపించింది. దీంతో త‌ప్పెక్క‌డ జ‌రిగిందో తెలుసుకునే ప‌నిలో దిల్ రాజు దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగార‌ట‌. త‌మిళంలో విజ‌య‌వంత‌మై భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన 'వారీసు' తెలుగుకు వ‌చ్చే స‌రికి చ‌తికిల ప‌డిపోయింద‌ని త‌న వ‌ర్గంతో ప్ర‌త్యేకంగా దిల్ రాజు స‌మాలోచ‌న‌లు చేసిన‌ట్టుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.