Begin typing your search above and press return to search.

వరుణ్ తేజ్ కోసం చెర్రీ వ‌దులుకున్నారా?

By:  Tupaki Desk   |   18 Jun 2021 9:30 AM GMT
వరుణ్ తేజ్ కోసం చెర్రీ వ‌దులుకున్నారా?
X
ఛ‌లో - భీష్మ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్ని తెర‌కెక్కించిన వెంకీ కుడుముల గ‌త కొంత‌కాలంగా రామ్ చ‌ర‌ణ్ కోసం స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అత‌డు ఇంత‌కుముందే లైన్ ఓకే చేయించుకుని బౌండ్ స్క్రిప్టును రెడీ చేశాడు. ఫైన‌ల్ గా చెర్రీకి స్క్రిప్ట్ ని వినిపించాడు. కానీ చెర్రీ ఈ ప్రాజెక్ట్ ను సున్నితంగా తిర‌స్క‌రించార‌ని తెలిసింది.

ఇంత‌లోనే వరుణ్ తేజ్ తో కలిసి వెంకీ ఓ సినిమా కోసం పని చేయబోతున్నట్లు క‌థ‌నాలు వ‌చ్చాయి. నిజానికి రామ్ చ‌ర‌ణ్ కి వినిపించిన క‌థ‌నే వ‌రుణ్ కోసం లాక్ చేశార‌ట‌. రెండు సార్లు చ‌ర‌ణ్ తో క‌థా చ‌ర్చ‌లు సాగించిన వెంకీ కుడుములకు గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు. చ‌ర‌ణ్ వెంకీ క‌థ‌ను మర్యాదగా తిరస్కరించారు. అనంత‌రం అదే క‌థ‌ను వరుణ్ తేజ్ కి వినిపించి ఓకే చేయించుకున్నారు. గ‌ని పూర్త‌యిన‌ తర్వాత వెంకి కుడుములతో వ‌రుణ్ తేజ్ సెట్స్ పైకి వెళ‌తారు. గ‌ని చిత్రంలో వ‌రుణ్ బాక్సర్ పాత్రను పోషిస్తున్నాడు. ఇక వ‌రుణ్ కోస‌మే సోద‌రుడు రామ్ చ‌ర‌ణ్ ఈ స్క్రిప్ట్ ని వ‌దులుకున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.