ఒక్క ట్వీట్ తో రూమర్స్ కు చెక్ పెట్టిన చైతూ..!

Tue Sep 14 2021 11:01:26 GMT+0530 (IST)

Did Chaitu check the rumors with a single tweet

టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య - సమంత ల వైవాహిక జీవితం గురించి గత కొన్ని రోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై ఇంతవరకు చైతూ కానీ సామ్ కానీ స్పందించకపోవడంతో.. సోషల్ మీడియా వేదికగా చై-సామ్ బ్రేకప్ రూమర్స్ విపరీతంగా చక్కర్లు కొట్టాయి. అయితే ఈ పుకార్లకు 'లవ్ స్టోరీ' ట్రైలర్ ఎండ్ కార్డ్ వేసింది.వివరాల్లోకి వెళ్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ' సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది.విశేష స్పందన తెచ్చుకుంటున్న ఈ ట్రైలర్ మీద చైతన్య సతీమణి సమంత కూడా స్పందించారు. చైతూ ట్వీట్ ని కోట్ చేస్తూ.. ''విన్నర్.. టీమ్ మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్'' అని ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి ‘థ్యాంక్యూ సో మచ్’ అంటూ సాయిపల్లవి కూడా సమాధానం ఇచ్చింది.

అయితే సమంత తన ట్వీట్ లో సాయి పల్లవి ని మాత్రమే ట్యాగ్ చేసి నాగచైతన్య పేరుని మెన్షన్ చేయకపోవడం పై అందరిలో అనేక సందేహాలు వ్యక్తం అయ్యాయి. అక్కినేని అభిమానులు మాత్రం సామ్ ట్వీట్ లో 'విన్నర్' అంటే చైతన్య అని.. చైతూ ట్వీట్ నే రీట్వీట్ చేసినప్పుడు సెపరేట్ గా మళ్ళీ ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేశారు. అయినప్పటికీ ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడలేదు.

ఈ నేపథ్యంలో నాగచైతన్య ట్విట్టర్ వేదికగా పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. తన సతీమణి సమంత ట్వీట్ కు చైతూ తాజాగా రిప్లై ఇచ్చారు. ''థాంక్స్ సామ్'' అని చై తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో చై-సామ్ జంట మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. ఒక్క ట్వీట్ తో అందరికీ సమాధానం దొరికిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ అయితే కామెంట్ల రూపంలో తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు.

ఎందుకంటే ప్రేమ వివాహం చేసుకొని మోస్ట్ సెలబ్రెటెడ్ కపుల్ గా ఉన్న నాగచైతన్య-సమంత జంట విడిపోతున్నారనే వార్తలు అభిమానులకు రుచించలేదు. అందుకే ఇప్పుడు చై - సామ్ ట్వీట్స్ చేయడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. త్వరలోనే సమంత తన సోషల్ మీడియా ప్రొఫైల్ లో ‘అక్కినేని’ పదాన్ని తీసేయడానికి గల కారణం ఏంటో చెప్పేస్తే.. అన్నిటి మీద క్లారిటీ వచ్చినట్లే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.