Begin typing your search above and press return to search.

లెజెండ్రీ స్టార్‌ మనవరాలు తెరంగేట్రంకు రెడీ

By:  Tupaki Desk   |   27 July 2021 4:48 AM GMT
లెజెండ్రీ స్టార్‌ మనవరాలు తెరంగేట్రంకు రెడీ
X
సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది చాలా కామన్ విషయం. సుదీర్ఘ కాలంగా వారసులు సినిమా ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. బాలీవుడ్‌ తో పాటు అన్ని వుడ్స్‌ లో కూడా వారసులు ఉన్నారు. అయితే వారసుల్లో ఎక్కువ శాతం మంది హీరోలు మాత్రమే ఉన్నారు. స్టార్స్ ఫ్యామిలీ నుండి అమ్మాయిలు ఎక్కువగా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మాత్రం లేదు. బాలీవుడ్‌ లో కాస్త ఎక్కువ మంది స్టార్‌ కిడ్స్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీకి పరిచయం అయినా సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్ గా పరిచయం అయిన స్టార్‌ కిడ్స్ కొద్ది మంది మాత్రమే అనడంలో సందేహం లేదు. సౌత్‌ ఇండియా స్టార్స్ నట వారసులుగా ఈమద్య కాలంలో హీరోయిన్స్ కూడా ఎంట్రీ ఇస్తున్నారు.

కన్నడ ఇండస్ట్రీకి చెందిన అర్జున్‌ కూతురు ఇప్పటికే హీరోయిన్ గా ఉంది.. ఇక తమిళ స్టార్‌ శరత్‌ కుమార్ కూతురు హీరోయిన్ గా దూసుకు పోతుంది. ఇక టాలీవుడ్‌ హీరో రాజశేఖర్‌ ఇద్దరు కూతుర్లు కూడా హీరోయిన్స్ గా సక్సెస్ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కన్నడ లెజెండ్రీ స్టార్‌ రాజ్ కుమార్‌ ఫ్యామిలీ నుండి అమ్మాయి ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతుంది. అది కూడా ఒక హీరోయిన్ గా ఆమె సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కన్నడ లెజెండ్రీ స్టార్‌ రాజ్ కుమార్‌ కు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు ఉంది అనడంలో సందేహం లేదు. ఆయన తనయులు ఇద్దరు కూడా ప్రస్తుతం కన్నడ సినిమా ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. ఇప్పుడు రాజ్‌ కుమార్ మనవరాలు ధన్య రాజ్‌ కుమార్‌ హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. రాజ్ కుమార్‌ కూతురు పూర్ణిమ రాజ్‌ కుమార్‌. ఆమె కూతురు ఈ ధన్య రాజ్‌ కుమార్‌. రాజ్ కుమార్‌ మనవరాలుగా తెరంగేట్రంకు సిద్దం అయిన ధన్య రాజ్‌ కుమార్ ఇప్పటికే సోషల్‌ మీడియాలో చాలా పాపులర్ అయ్యింది.

త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఈ స్టార్‌ కిడ్‌ అందాల ఆరబోత ఫొటో షూట్‌ ను రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంది. తాజాగా ధన్య రాజ్ కుమార్ ను హీరోయిన్‌ గా పరిచయం చేసేందుకు పలువురు కన్నడ ఫిల్మ్‌ మేకర్స్ సిద్దంగా ఉన్నారట. మరి ఎవరితో ఈమె ఎంట్రీ ఇస్తుందో చూడాలి. సౌత్‌ లో స్టార్‌ కిడ్స్ కు స్టార్ డం దక్కడం లేదు. మరి ధన్యకు ఆ స్టార్‌ డం దక్కేనా చూడాలి.