Begin typing your search above and press return to search.
బాబా రామ్ దేవ్ వేషంతో షాకిస్తున్న స్టార్ హీరో
By: Tupaki Desk | 30 May 2023 9:04 AMపొడవాటి జుట్టు .. గుబురు గడ్డం.. ఏజ్డ్ పర్సన్ గా రూపాంతరం.. ఇదంతా చూస్తుంటే అతడు ఎవరో కనిపెట్టడం అంత సులువేమీ కాదు. ఒక స్టార్ హీరో అయి ఉండీ గుర్తుపట్ట లేని విధంగా కనిపించాడు. విమానాశ్రయం నుంచి తిరిగి వస్తూ దిగిన ఈ ఫోటోల ను ధనుష్ సోషల్ మీడియాల్లో షేర్ చేయగా వైరల్ గా మారాయి. బ్లాక్ జాగర్స్ సన్ గ్లాసె స్ తో పాటు మెరూన్ స్వెట్ షర్ట్ లో అతడు కూల్ గా కనిపించాడు.
అంతే కాదు విమానాశ్రయం నుంచి వెళుతూ అభిమానులతో ను అతడు సెల్ఫీలు దిగాడు. కానీ ధనుష్ కొత్త లుక్ చాలా మంది అభిమానుల మతులు చెడగొట్టింది. అతడి ని బాబా రామ్ దేవ్ తో పోల్చారు. బాబా రామ్‌దేవ్ ప్రో అని ఒకరు వ్యాఖ్యానించగా.. "బాబా రామ్ దేవ్ పర్ బయోపిక్ బన్నె వాలీ హై" అని నేను అనుకుంటున్నాను" అని ఓ నెటిజన్ అన్నారు.
'బాబా రామ్ దేవ్ మీరేనా?' అంటూ మరొకరు ప్రశ్నించారు. అసలు మిమ్మల్ని ఎలా గుర్తించారంటూ వేరొక అభిమాని ఆశ్చర్య పోయాడు. ఈ కొత్త అవతారంలో ప్రజలు అతడి ని గుర్తించలేదు! అని ఒకరు వ్యాఖ్యానించారు. నిజాని కి ఇటీవల తన వేషధారణలతో ధనుష్ అసాధారణ ప్రయత్నం చేస్తున్నారు.
ధనుష్ తదుపరి చిత్రం 'కెప్టెన్ మిల్లర్' నుంచి లుక్ ఇదేనా? కాదా.. అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఆ సినిమా లో రెండు పాత్రలు పోషిస్తున్నాడు. తండ్రి కొడుకులుగా ధనుష్ ఇప్పటికే పలు సినిమాల్లో అలరించారు. అదేవిధంగా ఈ సినిమాలో ను కనిపించనున్నారు. ఈ చిత్రాని కి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు మారి సెల్వరాజ్ తోను ధనుష్ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసినదే.