టైర్ లో గాలి తీసేసినట్లు అలా నవ్వేసిందేంటి?

Fri Oct 07 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

Dhanush and Nayanthara Interview Yaaradi Nee Mohini

హీరో-హీరోయిన్ల మధ్య చోటు చేసుకునే కొన్ని రియల్  సన్నివేశాలు ఎంత ఆసక్తిగా ఉంటాయో? అంతే హాస్యాస్పదంగానూ ఉంటాయి. అనుకోకుండా చోటుచేసుకున్నప్పుడే ఆ సన్నివేశాల్లో హాస్యం ఉట్టుపడుతుంది. సినిమాటిక్ కాని సన్నివేశాలు మరింత నవ్వు తెప్పిస్తాయి. ఇదిగో ఇక్కడ కనిపిస్తోన్న జంటను చూస్తే అదే అనుభూతి కలుగుతుంది.ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా ధనుష్-నయనతార జంటగా హాజరయ్యారు. ఇంటర్వ్యూయర్ సినిమాకి సంబంధించిన ప్రశ్నలతో పాటు..వ్యక్తిగత ప్రశ్నలు కూడా సంధించారు. ఈక్రమంలో స్టోరీ ఒక్కసారిగా ధనుష్..నయన్ స్కూల్ ..కాలేజీ లైఫ్ లోకి వెళ్లింది. అప్పుడే ఇంటర్వ్యూయర్ ధనుష్ ని   కాలేజ్ లైఫ్ గురించి చెప్పండని అడిగారు. దీనికి ధనుష్ నేను కాలేజీకి పోలేదు.

స్కూల్ కి మాత్రమే వెళ్లాను అని మనసులో మాటని ఎంతో ఓపెన్ గా అమాయకంగా చెప్పాడు. దీంతో ఆ పక్కనే కూర్చుని ఉన్న నయనతార పకపకా పగలబడి నవ్వింది. వెంటను ధనుష్ నయనతారని చూసి అదో రకమైన  అమాయక ఎక్స్ ప్రెషెన్ ఇచ్చాడు. అందరూ కాలేజీకిపోయి చదువుకుంటే..నేను  కాలేజీకి వెళ్లలేదని నయనతార అలా నవ్విందా? అని ఓ  ఎక్స్ ప్రెషన్ ఇచ్చి రీగ్రిట్ ఫీలయ్యాడు.

ఆ సమయంలో ఇంటర్వ్యూయర్ నయనతార కాలేజీ కథ గురించి అడిగాడు. ఆమె ఓవైపు సమాధానం చెబుతూనే రెండు చేతులు అడ్డు పెట్టుకుని మరీ  అప్పటికీ ఇంకా నవ్వుతూనే ఉంది.  నిజంగా ఇది అతి పెద్ద రియల్ కామెడీ సీన్  గానే క నిపించింది. కోలీవుడ్ లో ధనుష్ పెద్ద స్టార్. అప్పుడు నయన్ ఇండస్ర్టీలో ఎదుగుతోన్న హీరోయిన్.

అలాంటి నటి స్టార్  హీరో ముందు నవ్వితే ఆ హీరో పరిస్థితి ఏంటి? అన్నది ఊహకే వదిలేయాలి. వీడియో పాతదే అయినా ఇప్పుడిది నెట్టింట వైరల్ అవుతోంది. అప్పట్లో  సోషల్ మీడియా  అందుబాటులో లేదు కాబట్టి విషయం బయటకు రాలేదు.

ఇప్పుడు స్మార్ట్ యుగంలోకి వచ్చేయడంతో పాత వీడియోల్సి సైతం తవ్వి తీసి ఇలా ఆడేసుకుంటున్నారు. ఇక నయన్-ధనుష్ జంటగా కొన్ని సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నయనతార సౌత్ లోనే అగ్ర హీరోయిన్ గా కొనసాగుతోంది. ధనుష్ పాన్ ఇండియాలో క్రేజ్ దక్కించుకున్నాడు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.