సెన్సార్ అభ్యంతరాలు… ధనుష్ సార్ రన్ టైమ్ ఏంటంటే?

Sun Jan 29 2023 13:00:01 GMT+0530 (India Standard Time)

Dhanush Sir Movie Censor Report

వెంకి అట్లూరి దర్శకత్వంలో తమిళ్ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కిన సినిమా సార్. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది. తెలుగు తమిళ్ భాషలలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. తొలిప్రేమ మిస్టర్ మజ్ను సినిమాల తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇది కావడం విశేషం. అయితే మొదటి రెండు సినిమాల కోసం ప్రేమ కథలని ఎంచుకున్న వెంకీ అట్లూరి సార్ చిత్రాన్ని మాత్రం సోషల్ ఎలిమెంట్స్ తో ఆవిష్కరించినట్లు తెలుస్తుంది.ముఖ్యంగా కార్పోరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పై సెటైరికల్ గా ఈ సినిమాని వెంకీ అట్లూరి సిద్ధం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇక మూవీలో ఒక జూనియర్ కాలేజీలో లెక్చరర్ పాత్రలో ధనుష్ కనిపించబోతున్నాడు. ఇలాంటి పాత్రలో ధనుష్ కనిపించడం ఇదే మొదటి సారి అని చెప్పాలి.

మాస్ క్యారెక్టర్స్ లో ఎక్కువ కనిపించిన ధనుష్ మొదటి సారి ఒక లెక్చరర్ గా సార్ మూవీలో సందడి చేయనుండటం విశేషం. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కి వెళ్ళింది. ఈ సందర్భంగా  కాంట్రవర్సీ క్రియేట్ చేసే కొన్ని సన్నివేశాలకి సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తుంది. వాటిని కాస్తా సరిచేయమని సూచించినట్లు తెలుస్తుంది. ఇక సినిమా రన్ 2.03 గంటలు నిడివి ఉంటుందని తెలుస్తుంది.

సామాజిక అంశాలని ప్రస్తావిస్తూ విద్యార్ధుల భవిష్యత్తు కార్పోరేట్ విద్యావ్యవస్థ కారణంగా ఎలాంటి ఇబ్బందుల్లో పడుతుంది. కార్పోరేట్ విద్యావిధానం తట్టుకోలేక విద్యార్ధులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంతున్నారు అనే విషయాలని సినిమాలో ప్రస్తావించినట్లు తెలుస్తుంది. కార్పోరేట్ కాలేజీలలో పిల్లల్ని చదివించాలని అనుకునే తల్లిదండ్రులకి సామాజిక సందేశం ఇచ్చే విధంగా ఈ కాన్సెప్ట్ ఉండబోతుంది అని తెలుస్తుంది. మరి ఈ కథతో వెంకీ అట్లూరి ఎలాంటి హిట్ కొడతాడు అనేది చూడాలి.