Begin typing your search above and press return to search.

పాట పాడుతా అంటూ హంగామా చేసిన నవీన్ పొలిశెట్టి

By:  Tupaki Desk   |   28 May 2023 10:35 AM GMT
పాట పాడుతా అంటూ హంగామా చేసిన నవీన్ పొలిశెట్టి
X
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జోడీగా మహేష్ దర్శకత్వంలో మిస్టర్ అండ్ మిస్సెస్ శెట్టి అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమాని న్యూ ఏజ్ ఫిల్మ్ గా తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వస్తోంది. నిశ్శబ్దం తర్వాత అనుష్క శెట్టి నుంచి వస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం.

ఇక జాతిరత్నాలుతో బ్లాక్ బస్టర్ అందుకున్న నవీన్ పోలిశెట్టికి కూడా ఇదే లేటెస్ట్ మూవీ. ఇదిలా ఉంటే నవీన్ పొలిశెట్టి తన సినిమాల ప్రమోషన్ విషయంలో డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్తాడు. ప్రతి అప్డేట్ ని కాస్తా ఫన్ టచ్ ఇస్తూ ప్రేక్షకులకి చేరువ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక తాజా మూవీ మిస్టర్ అండ్ మిస్సెస్ శెట్టి మూవీని కూడా తన స్టైల్ లో ప్రమోట్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ నుంచి హతవిది అంటూ సాగే పాటని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ పాట ప్రమోషన్ కోసం ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో నవీన్ పొలిశెట్టి మూవీలో పాట పాడుతా అంటూ హడావిడి చేస్తాడు. ఈ మధ్యలో హీరోలే సినిమాలో పాటలు కూడా పాడేస్తున్నారు. నాది కూడా మంచి వాయిస్. నేను పాడుతా అంటూ నిర్మాతతో అంటాడు.

తరువాత దర్శకుడు మహేష్ దగ్గరకి వెళ్లి తన సింగింగ్ టాలెంట్ చూపిస్తాడు. అలాగే సింగర్ రామజోగయ్య శాస్త్రీ దగ్గరకి వచ్చి కూడా అతను పాడిన పాటని హమ్ చేస్తాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ రాదాన్ ని ఒప్పించి స్టూడియోలో మైక్ ముందు పాట పాడటానికి ట్రై చేస్తాడు. అతను పాట పాడటానికి ట్రై చేస్తూ ఉంటే మరో వాయిస్ వస్తోంది.

ఇక హతవిది అంటూ సాగే ఈ పాటని కోలీవుడ్ స్టార్ ధనుష్ ఆలపించినట్లు ప్రెజెంట్ చేసి మే31న ఫుల్ లెరికల్ సాంగ్ ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్ ప్రమోషన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా నవీన్ పొలిశెట్టి ఈ ప్రోమో వీడియోలో సాంగ్ పాడుతా అంటూ చేసిన హంగామా ఫన్ క్రియేట్ చేస్తూ ఉండటం విశేషం.