జాల్ రెడ్డి అక్కడ మళ్లీ హిట్ కొట్టాడోచ్

Fri Mar 31 2023 21:20:40 GMT+0530 (India Standard Time)

Dhanunjay has another success at the box office

పుష్ప సినిమాలో జాల్ రెడ్డి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన కన్నడ నటుడు ధనుంజయ్. పుష్ప తర్వాత తెలుగు లో ఈయనకు మంచి గుర్తింపు లభించింది. గత ఏడాది ధనుంజయ్ నటించిన బడవ రాస్కెల్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తెలుగు లో కూడా డబ్ అయి ఒక మోస్తరుగా అలరించింది.తాజాగా మరో సినిమాతో ధనుంజయ్ కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'గురేదవ్ హోయ్ సల' చిత్రంతో ధనుంజయ్ బాక్సాఫీస్ వద్ద మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ధనుంజయ్ మెప్పించాడు. డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ అయిన గురుదేవ్ పాత్రలో ధనుంజయ్ కనిపించాడు.

ఒక ప్రేమ జంటకు పెళ్లి చేయడంతో గురుదేవ్ విలన్ గ్యాంగ్ తో గొడవ పడాల్సి వస్తుంది. ఒక వైపు విలన్ గ్యాంగ్ ఆ ప్రేమికులను చంపేందుకు ప్రయత్నిస్తూ మరో వైపు పోలీస్ ఆఫీసర్ గురుదేవ్ ను కూడా చంపేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ గా సాగింది. విజయ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకు కన్నడ నాట మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. తెలుగు లో కూడా డబ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పుష్ప సినిమా లో జాల్ రెడ్డి పాత్రలో ఎంతటి క్రూరంగా కనిపించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా కూడా ధనుంజయ్ మంచి సక్సెస్ లను అందుకుంటున్నాడు.

అదే సమయంలో తెలుగు లో మరియు ఇతర భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా నటించేందుకు ఓకే చెబుతున్నాడు. తెలుగు లో జాల్ రెడ్డి మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.