అల్లరి నరేష్ రూట్ మార్చిన సంగతి తెలిసిందే. కామెడీని పక్కనబెట్టి సీరియల్స్ రోల్స్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. లుక్ పరంగానూ శరీరాకృతిలో మార్పులు తీసుకొచ్చారు. ట్రెండ్ కి తగ్గట్టు మౌల్డ్ అవుతున్నారు. ప్రస్తుతం నాంది లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో 'ఉగ్రం' అనే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే నరేష్ మరో కెరీర్ లో మరో డిఫరెంట్ అటెంప్ట్ అని క్లారిటీ వచ్చేసింది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని నరేష్ లుక్ తోనే అర్ధమైంది. ఇక టీజర్..ట్రైలర్ పూర్తి గా సరికొత్త నరేష్ ని ఆవిష్కరించాయి.
క్యారక్టరైజేషన్ ని హైలైట్ చేస్తున్నాయి. ఇప్పటివరకూ కామెడీ పాత్రల్లో చూసిన నరేష్ సీరియస్ రోల్స్ కి సూటవుతాడా? లేదా? అనే సందేహాలుండేవి. కానీ 'ఉగ్రం' ప్రచార చిత్రాలతో నరేష్ అన్ని రకాల పాత్రలకు న్యాయం చేయగల నటుడని నిరూపించాడు.
తాజాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సినిమాకి సంబంధించిన ఓ ఫీల్ గుడ్ మెలోడ ఫుల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు. పాట ఆద్యంతం మెలోడీ ట్రాక్ లో సాగుతుంది. 'దేవేరి గుండెల్లో చేరి.. మదిలో మోగిందే సరిగమ సావేరి' శ్రోతల్ని ఆకట్టుకుంటుంది. మెలోడీ ప్రియులకు ఈ పాట బాగా కనెక్ట్ అవుతుంది. స్టోరీతో పాటు సాగే సాంగ్ ఇది. విజువల్స్ బాగున్నాయి.
శ్రీమణి రాసిన ఈ పాటను శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేసారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. పోలీసా ఫీసర్ అయిన నరేశ్ హీరోయిన్ మిర్ణాతో ప్రేమలో మునిగిపోతూ పాడుకునే ఈ పాట ఇది.
పాటలోనూ నరేష్ సెటిల్డ్ పెర్పార్మెన్స్ ఇచ్చాడు. కామెడి టింజ్ ఎక్కడా సాంగ్ లో కనిపించలేదు. 'ఉగ్రం'లో మలయాళ భామ మిర్ణా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి- హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మే 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.