తెలుగు తమిళ్ వివాదంపై రెహమాన్ మాట ఇది!

Fri Jan 27 2023 19:00:01 GMT+0530 (India Standard Time)

Despite our differences, we are all one family: Rahman

యావత్ దేశం మొత్తం మార్చి 12న జరగనున్న ఆస్కార్ అవార్డుల వేడుకలో 'RRR' సాధించనున్న అవార్డు ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 'స్లమ్ డాగ్ మిలియనీర్' మూవీతో ఏ. ఆర్. రెహమాన్ కు ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే. అయితే అది హిందీ సినిమాకు గాను దక్కింది. కానీ ఈ సారి 'RRR' ప్రాంతీయ సినిమా.. అందులోనూ తెలుగు సినిమా. ఈ మూవీకి ఆస్కార్ దక్కనుండటం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.ఈ మూవీ ఖచ్చితంగా ఆస్కార్ ని సాధిస్తుందని ఇప్పటికే పలువురు హాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ చెబుతూ వస్తున్నారు. హాలీవుడ్ మీడియా కూడా ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ మన వాళ్లలో మరింత జోష్ ని నింపుతోంది. ఆస్కార్ రేసులో 'RRR' ఖచ్చితంగా ఊహించని విధంగా అవార్డుని దక్కించుకుని చరిత్ర సృష్టిస్తుందని అత్యధిక శాతం మంది అంచనా వేస్తూ వచ్చారు. ముందు ఈ మూవీ ఆస్కార్ బరిలో మూడు కీలక విభాగాల్లో ఎంట్రీని సాధిస్తుందని భావించారు.

కానీ ఇటీవల ప్రకటించిన ఫైనల్ లిస్ట్ లో ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఊహించని విధంగా 'RRR' ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'నాటు నాటు' పాట పరంగా మాత్రమే నామినేషన్ ని దక్కించుకోవడం పలువురిని షాక్ కు గురిచేస్తోంది.

ఇదిలా వుంటే 'RRR' ఆస్కార్ బరిలో నిలవడంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రెహమాన్ స్పందించారు. చంద్రబోస్ తో కలిసి కీరవాణిగారు మీరు ఖచ్చితంగా అవార్డుని దక్కించుకుంటారని నాకు గట్టి నమ్మకం. బెస్ట్ విషెస్ లు 'RRR' టీమ్ అని ట్వీట్ చేశారు.

అయితే రెహమాన్ స్పందన పై తమిళ తంబీలు ఫీలవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెడుతూ రెహమాన్ కు ట్యాగ్ చేస్తున్నారు. ఆంధ్రా ప్రజలు ఇప్పటికీ తమిళులని ద్వేషిస్తున్నారని కానీ మన వాళ్లు మాత్రం వాళ్లని ప్రేమిస్తున్నారని ట్వీట్ చేశాడో తమిళ నెటిజన్. దీనికి రెహమాన్ కరెక్ట్ సమాధానం చెప్పడం ఆసక్తికరంగా మారింది. మనమంతా ఒకటే కుటుంబం. మన మధ్య భేదాభిప్రాయలు వున్నా సరే ఒకరి కోసం ఒకరం నిలబడతాం'అంటూ స్పందించడం విశేషం.

రెహమాన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దాదాపు పన్నెండేళ్ల క్రితం రెహమాన్ 'స్లమ్ డాగ్ మిలియనీర్' మూవీకి గానూ బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డుని దక్కించుకుని భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన విషయం తెలిసిందే. రెహమాన్ ప్రస్తుతం తమిళ హిందీ ఇంగ్లీష్ భాషల్లో పలు క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తూ బిజీ బిజీగా వున్నారు. ఇందులో కమల్ మణిరత్నం కాంబో మూవీ కూడా ఒకటి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.