ప్రభాస్ తో కావాలనే ‘ కేజీఎఫ్’ హీరోయిన్

Mon May 03 2021 12:00:01 GMT+0530 (IST)

Deliberately 'KGF' heroine with Prabhas

ప్రభాస్ సినిమా అంటే కాదనేవాళ్లు ఎవరు. బాహుబలితో ఆయనకు ప్యాన్ ఇండియా స్టార్ గా ఆ స్టేటస్ వచ్చేసింది. ఎక్కడెక్కడి హీరోయిన్స్ ఆయనతో చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ ఆయన సినిమా కోసం డైరక్టర్స్ ...ఆ స్దాయికు తగ్గవారినే ఎంపిక చేస్తున్నారు. మిగతావాళ్లకు పాపం మొండిచెయ్యే ఎదురౌతోంది. దాంతో ఆయన సినిమా లో స్పెషల్ సాంగ్ అయినా చేస్తామంటున్నారట. అలా ‘ కేజీఎఫ్’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ..ప్రభాస్ సినిమాలోకు ఎంట్రీ ఇస్తోందని సమాచారం. ‘ కేజీఎఫ్’ డైరక్టర్ తో ఉన్న పరిచయంతో ఆమె ఈ ఆఫర్ ని సాధించిందిట.శ్రీనిధి శెట్టి ఇప్పుడు ప్రభాస్ కోసం స్పెషల్ సాంగ్ చేయబోతోంది. ఈ మేరకు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పవర్ ఫుల్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న సలార్ లో ప్రభాస్ పక్కన ఆడిపాడేందుకు నిధి ఆసక్తి చూపుతోందని అంటున్నారు. ఈ విషయమై చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక 'కేజీఎఫ్'తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అలానే ఆ చిత్ర హీరో యశ్ కు హీరోయిన్ శ్రీనిధి శెట్టికి సూపర్ క్రేజ్ వచ్చేసింది. అంతేకాదు ఈ సినిమాలో చేసిన విలన్స్ సైతం ఫుల్ బిజీ అయ్యిపోయారు. రీసెంట్ గా కార్తీ సుల్తాన్ సినిమాలో విలన్ గా చేసాడు. అలా కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులకూ వేరే లాంగ్వేజ్ ల నుండి విశేషంగా ఆఫర్స్ వస్తున్నాయి.

 శ్రీనిధి శెట్టి విషయానికి వస్తే  ప్రస్తుతం తమిళంలో విక్రమ్ సరసన 'కోబ్రా' మూవీలో నటిస్తోంది. హీరోయిన్ గా మంచి ఆఫర్స్ వస్తున్నా ప్రభాస్  మీద ఉన్న అభిమానంతో 'సాలార్' డాన్స్ చేయబోతోంది శ్రీనిధి శెట్టి. కాబట్టి ఈ శాండిల్ వుడ్ బ్యూటీ  మన టాలీవుడ్ కు ఐటమ్ సాంగ్ తో ఎంట్రీ ఇవ్వబోతోందన్నమాట. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్నసలార్ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.  2021 ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల కానుందని ప్రకటించారు. కానీ ఇప్పడు రిలీజ్ డేట్ మారే అవకాసం ఉంది.