Begin typing your search above and press return to search.

ధమాకా ఇన్ని డిలీట్ సీన్స్ ఏంటి సామీ..!

By:  Tupaki Desk   |   23 Jan 2023 5:00 PM GMT
ధమాకా ఇన్ని డిలీట్ సీన్స్ ఏంటి సామీ..!
X
ఒక సినిమా పేపర్ మీద అనుకున్న దాని కంటే తెర మీద చూసినప్పటికీ చాలా డెవలప్ మెంట్స్ జరుగుతాయి. ఉన్నది ఉన్నట్టుగా రాసుకున్నది తీయడమే కాదు కొన్ని అప్పటికప్పుడు కూడా తీస్తారు. సినిమా మొదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యేంత వరకు ఉన్న రష్ లో ఏది ఉంచాలి ఏది తుంచాలి అన్నది ఎడిటర్, డైరెక్టర్ పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. అయితే ఈ క్రమంలో మరీ ఎక్కువ రన్ టైం తో వచ్చి రిస్క్ ఎందుకని కొంతమంది దర్శకులు కొన్ని సీన్స్ అది కూడా సినిమా కథకు ఎఫెక్ట్ కావు అనిపించని ట్రిం చేస్తారు.

అలాంటి సీన్స్ అన్ని కలిపి డిలీటెడ్ సీన్స్ అని తర్వాత యూట్యూబ్ ఛానెల్ లో రిలీజ్ చేస్తారు. అయితే రీసెంట్ గా వచ్చిన ధమాకా సినిమాలో చాలా సీన్స్ ట్రిం చేసినట్టు అనిపిస్తుంది.

సినిమా రిలీజై సూపర్ హిట్ కాగా సినిమాలోని డిలీటెడ్ సీన్స్ అంటూ మేకర్స్ కొన్ని సీన్స్ రిలీజ్ చేస్తున్నారు. ధమాకా సినిమా విషయంలో ఈ డిలీటెడ్ సీన్స్ ఎక్కువయ్యాయని టాక్. సినిమా రన్ టైం ను దృష్టిలో పెట్టుకుని కొన్ని సీన్స్ డిలీట్ చేసినా ధమాకా విషయంలో అవి ఎక్కువ అయ్యాయని అంటున్నారు.

అయితే ఈ డిలీటెడ్ సీన్స్ అన్ని సినిమా కథకు ఎఫెక్ట్ కాకుండా ఉండడం.. కామెడీ సీన్స్ అవడం వల్ల డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇందులో విశేషం ఏంటంటే ఒక సీన్ లో డైరెక్టర్ నక్కిన త్రినాథరావు కూడా ఉన్నాడు. కానీ ఆయన సీన్ కూడా అవసరం లేదనిపించి డిలీట్ చేశారు. మొత్తానికి డిలీటెడ్ సీన్స్ లో కూడా ధమాకా ఓ డిఫరెంట్ రికార్డ్ సృష్టించేలా ఉంది.

చాలా సినిమాలు ఇలా చాలా సీన్స్ ట్రిం చేసి ఉన్నా ధమాకా సినిమా యూనిట్ మాత్రమే వాటినన్నిటినీ యూట్యూబ్ లో పెడుతూ మాస్ రాజా ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ధమాకా బాక్సాఫీస్ దగ్గర ఆయన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసింది.

శ్రీలీల హీరోయిన్ గా నటించిన ధమాకా సినిమాకు భీమ్స్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. 100 కోట్ల ధమాకాతో సూపర్ జోష్ లో ఉన్న రవితేజ ఈమధ్యనే సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో కూడా మరో 100 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.