ఆ వార్తలు నిజం కాదన్న దీప్తి సునయన

Tue Jan 25 2022 11:32:36 GMT+0530 (IST)

Deepti Sunayana said that the news was not true

యూట్యూబ్ స్టార్ దీప్తి సునైన ఇటీవల బ్రేకప్ కారణంగా వార్తల్లో నిలిచింది. షన్నూ తో సుదీర్ఘ ప్రేమాయణం సాగించిన దీప్తి సునయన అనూహ్యంగా బ్రేకప్ చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. షన్నూ బిగ్ బాస్ లో ఉన్న సమయంలో కూడా ఆమె వెళ్లి అతడికి మద్దతుగా నిలిచింది..సోషల్ మీడియాలో అతడికి మద్దతుగా పబ్లిసిటీ చేసింది. కాని బిగ్ బాస్ నుండి షన్నూ రన్నర్ గా బయటకు వచ్చిన తర్వాత అనూహ్యంగా బ్రేకప్ చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో జరగిన పరిణామాల వల్లే ఆమె షన్నూ కు బ్రేకప్ చెప్పిందా అంటే ఔను అనే ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని అసలు విషయం ఏంటీ అనేది ఆమె మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. బ్రేకప్ తర్వాత మళ్లీ తన నార్మల్ లైఫ్ లో దీప్తి సాఫీగా అలా అలా సాగి పోతుంది.

దీప్తి సునైన ఎన్నో యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది.. పలు కవర్ సాంగ్స్ చేసి మెప్పించింది. చాలా సినిమాల్లో ఆమెకు ఆఫర్లు వచ్చాయి అనేది టాక్. కాని ప్రాముఖ్యత లేని పాత్రలు.. చిన్న సినిమాలు అవ్వడం వల్ల ఆమె పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది.

తాజాగా దీప్తి సునైనకు హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. ఆమె హీరోయిన్ గా నటించేందుకు రెడీ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం కు క్లారిటీ ఇచ్చింది. తనకు అలాంటి ఆఫర్ రాలేదు.. నేను కమిట్ అవ్వలేదు అన్నట్లుగా క్లారిటీ ఇచ్చింది. తాను ఎలాంటి సినిమా లో నటించడం లేదు.. హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది అనేది పూర్తిగా ఫేక్ న్యూస్ అంటూ దీప్తి సునైన స్వయంగా సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.

హీరోయిన్ గా నటించేంత గ్లామర్ మరియు క్యూట్ నెస్ దీప్తి సునైనకు ఉందని అంతే కాకుండా ఆమె నటిగా ఇప్పటికే నిరూపించుకుంది. ఆమె అద్బుతమైన ఎమోషన్స్ ను పండించగలదు అని ఆమె కవర్ సాంగ్స్.. మ్యూజిక్ ఆల్బమ్స్ మరియు షార్ట్ ఫిల్మ్స్ చూస్తే అర్థం అవుతుంది. కనుక దీప్తి సునయన హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నట్లుగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

కాని దీప్తి సునైనాకు ఆ దిశగా ఆసక్తి లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఇప్పటి వరకు వచ్చిన కొన్ని ఆఫర్లను కాదనడమే కాకుండా ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేయడం లేదేమో అంటూ కొందరు ఆమె సన్నిహితులు అంటూ ఉన్నారు. నెట్టింట దీప్తి సునైన ఫొటోలు రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటాయి. చాలా క్యూట్ గా పద్దతైన తెలుగు అమ్మాయిగా అలరిస్తూనే ఉంటుంది. కనుక దీప్తి సునయన ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.