Begin typing your search above and press return to search.

మాజీ ప్రియుడి తో మరీ ఇంత క్లోజ్‌ హగ్‌ అవసరమా?

By:  Tupaki Desk   |   2 Jun 2023 3:46 PM GMT
మాజీ ప్రియుడి తో మరీ ఇంత క్లోజ్‌ హగ్‌ అవసరమా?
X
బాలీవుడ్ లో స్టార్స్‌ ప్రేమ వ్యవహారాలు చాలా కామన్ విషయం. ఒకరి ని ప్రేమించి కొన్నాళ్లకు బ్రేకప్ చెప్పి మరొకరిని పెళ్లి చేసుకోవడం పలువురి విషయంలో మనం ఇప్పటికే చూశాం. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ యొక్క ప్రేమ కథలు ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి.

అందులోనే ఒక ప్రేమ కథ హీరోయిన్ దీపికా పదుకొనే. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం చాలా దూరం వెళ్లిందని.. ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యార ని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ రణబీర్ కపూర్ యొక్క ప్రవర్తన కారణంగా దీపికా పడుకొనే అతడి ని వదిలేసి రన్వీర్ సింగ్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఆ సందర్భంలో ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడు మళ్లీ ఇద్దరూ చాలా క్లోజ్ గా కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. యే జవానీ హై దీవానీ సినిమా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్న మే 31 వ తారీఖున చిత్ర యూనిట్ సభ్యులంతా కూడా రీ యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

ఆ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులందరూ బ్లాక్ డ్రెస్ లో కనుల విందు చేశారు. హీరో రణబీర్ కపూర్ హీరోయిన్ దీపికా పదుకొనే ఇంకా ఆదిత్య రాయ్ కపూర్.. కల్కి కోచ్లిన్ మరియు దర్శకుడు అయాన్ ముఖర్జీ కలిసి ఇలా ఫోటో కి ఫోజులిచ్చారు.

రీ యూనియన్ అనేది మంచి విషయమే.. అయితే మాజీ ప్రియుడు అయినా రణబీర్ కపూర్ తో మరీ ఇంత క్లోజ్ గా.. హగ్‌ చేసుకుని క్లోజ్‌ గా ఉండడం అవసరమా అంటూ దీపిక పదుకొనే విషయంలో కొందరు విమర్శలు చేస్తున్నారు.

పెళ్లయిన అమ్మాయి పరాయి పురుషుడి తో అది కూడా తన మాజీ ప్రియుడు తో ఇంత క్లోజ్ గా ఉండడం ఏ ఒక్కరు సహించరు. దీపిక పడుకునే విషయంలో కూడా కొందరు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ ఫోటో కి ఆమె స్పందన ఏంటి అనేది చూడాలి.