Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ కార్టూన్ పిచ్చిది అంట..!

By:  Tupaki Desk   |   30 May 2023 11:05 AM GMT
ఆ హీరోయిన్ కార్టూన్ పిచ్చిది అంట..!
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకునే ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇండియాస్ బిగ్గెస్ట్‌ స్టార్‌ హీరోయిన్ గా ఈ అమ్మడు దూసుకు పోతుంది. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలు మరియు ఈమె ఫోటో షూట్స్‌ ఈమెను గ్లోబల్‌ స్టార్ గా నిలుపుతున్నాయి అనడంలో సందేహం లేదు.

ఇటీవలే పఠాన్ సినిమా తో వెయ్యి కోట్ల క్లబ్‌ లో కూడా దీపికా పదుకునే చేరిన విషయం తెల్సిందే. షారుఖ్ ఖాన్‌ తో కలిసి ఆ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ దీపిక పదుకొణె ప్రస్తుతం చేస్తున్న సినిమాల సంఖ్య చాలా పెద్దగానే ఉంది. అందులో ఒకటి రెండు అయినా కూడా వెయ్యి కోట్ల సినిమాలుగా నిలుస్తాయనే టాక్ ఉంది.

తాజాగా ఇన్‌ స్టాగ్రామ్ లో అభిమానుల తో చిట్ చాట్‌ చేసింది. ఆ సందర్భంగా ఒక ఫ్యాన్ మీ ఆల్ టైమ్‌ ఫేవరెట్‌ కార్టూన్ షో ఏంటి అంటూ ప్రశ్నించగా దీపికా స్పందిస్తూ స్కూబీ డూ తన ఆల్‌ టైమ్ ఫేవరెట్‌ కార్టూన్ షో గా చెప్పుకుంది. అంతే కాకుండా ఆ షో కోసం తాను థీమ్‌ సాంగ్‌ ను కూడా పాడినట్లుగా తెలియజేసింది.

చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడే కార్టూన్ షో స్కూబీ డూ ను గ్లోబల్ స్టార్‌ అయిన దీపికా పదుకునే అభిమానించడం విడ్డూరంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే తెలుగు లో రూపొందుతున్న ప్రభాస్ మూవీ ప్రాజెక్ట్‌ కే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. హిందీ లో హృతిక్‌ రోషన్‌ మూవీ లో కూడా ఈ అమ్మడు నటిస్తోంది.