బాస్ లేడీ దిగింది.. ప్రభాస్ ని ఏం చేస్తదో ఏంటో!

Sat Dec 04 2021 14:00:01 GMT+0530 (IST)

Deepika Padukone landed in Hyderabad

ప్రభాస్ తో తన భారీ పాన్ ఇండియా మూవీ `ప్రాజెక్ట్ K` రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించడానికి దీపికా పదుకొణె ముంబై వదిలి హైదరాబాద్ లో అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన అద్భుతమైన ఫోటోలు వెబ్ లో హీటెక్కిస్తున్నాయి.తన తదుపరి ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ కు వెళ్లేందుకు శనివారం తెల్లవారుజామున ముంబై విమానాశ్రయానికి చేరుకున్న ఈ అందాల పద్మావత్ సరికొత్త బాస్ లుక్ మతి చెడగొట్టింది.

ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ లో దిగిన బాస్ లేడీ.. అలా స్టైల్ గా విమానాశ్రయానికి చేరుకోగా కెమెరా కళ్లు వెంటాడాయి. క్లిక్ లతో హోరెత్తించాయి.

దీపిక తన కారు నుండి దిగి కెమెరాలకు దూరంగా వెళుతూ ఉండటం కనిపించింది. దీపిక స్పెషల్ లుక్ వెనక చాలా సంగతే ఉంది. లిలక్ కో-ఆర్డ్ సెట్ తో తెల్లటి క్రాప్ టాప్ ధరించి ఎంతో స్టైలిష్ గా దీపిక కనిపించింది. కాలికి మెటాలిక్ లిలక్ హీల్స్.. చేతికి బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ అదనపు ఆకర్షణగా నిలిచాయి.

హైదరాబాద్ కు ఎలాంటి మేకప్ లేకుండా ప్లెయిన్ లుక్ తో రావడం సంథింగ్ స్పెషల్. ప్రభాస్ - అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభించడానికి దీపిక హైదరాబాద్ లో దిగింది. మొదటిసారి ప్రభాస్ సరసన ఈ బ్యూటీ నటిస్తుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మరోవైపు ప్రభాస్ తో నువ్వా నేనా? అంటూ ఇంతకుముందే దీపిక సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తో నేను కూడా సమానం! అనే రేంజులో దీపిక బిల్డప్ ఇవ్వడం దానికి డార్లింగ్ అభిమానులు కౌంటర్లు వేయడం కూడా మర్చిపోలేని ఎపిసోడ్. అందుకే శివంగి లేడీ ఎంట్రీ డార్లింగ్ అభిమానుల్లో డౌట్లు పుట్టించేస్తోంది.

ఇదిలా ఉండగా మరోవైపు దీపిక శనివారం ఉదయం తన భర్త రణ్ వీర్ సింగ్ కు ప్రశంసల పోస్ట్ తో ప్రేమ సింబల్స్ ని పంపడం ఆసక్తిని కలిగించింది. దీప్ వీర్ అభిమానులందరినీ ఇద్దరినీ విస్మయానికి గురి చేసింది.

భర్తతో కలిసి దీపిక నటించిన 83 మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలోనూ ఒక నిర్మాతగా నటిగా బిజీగా ఉంది దీపిక.

ఇతర కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రభాస్- నాగ్ అశ్విన్ చిత్రం ప్రాజెక్ట్ K కాకుండా పలు హిందీ చిత్రాలతోనూ దీపిక బిజీ. సిద్ధాంత్ చతుర్వేది - అనన్య పాండేలతో కలిసి షకున్ బాత్రా పేరులేని ప్రాజెక్ట్ లో దీపికా తదుపరి కనిపిస్తుంది. షారుఖ్ ఖాన్ - జాన్ అబ్రహంలతో పఠాన్ లో కూడా దీపిక నాయిక. హృతిక్ రోషన్ తో ఫైటర్ షూట్ లో పాల్గొంటోంది. అమితాబ్ బచ్చన్ తో తన సొంత నిర్మాణ చిత్రం ది ఇంటర్న్ లో చేస్తోంది.