Begin typing your search above and press return to search.

సౌత్‌ మూవీ అంటే ఇంకా అదే చిన్న చూపా అమ్మడు?

By:  Tupaki Desk   |   16 July 2020 4:45 AM GMT
సౌత్‌ మూవీ అంటే ఇంకా అదే చిన్న చూపా అమ్మడు?
X
ఒకప్పుడు సౌత్‌ సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇష్టపడేవారు కాదు. కాని ఇప్పుడు సౌత్‌ సినిమాల స్థాయి పెరిగింది. బాలీవుడ్‌ సినిమాల స్థాయిలో ఆ మాటకు వస్తే బాలీవుడ్‌ సినిమాలను మించి సౌత్‌ తో సినిమాలు రూపొందుతున్నాయి. అయినా కూడా దీపిక పదుకనే వంటి కొందరు హీరోయిన్స్‌ సౌత్‌ సినిమాలను చిన్న చూపు చూస్తున్నట్లుగానే ఉన్నారు.

సౌత్‌ సినిమాలో నటించమంటూ కోరితే గొంతెమ్మ కోర్కెలు కోరడంతో పాటు నిర్మాతలను భయపెట్టే పారితోషికం డిమాండ్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ లో తీసుకునే పారితోషికం కంటే కూడా అధికంగా డిమాండ్‌ చేస్తున్నారు కొందరు. ప్రభాస్‌ 21వ చిత్రం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో కన్ఫర్మ్‌ అయ్యింది. ఆ సినిమా కోసం దీపిక పదుకునేను సంప్రదించారట. అయితే ఆమె చెప్పిన పారితోషికం ఇతరత్ర డిమాండ్స్‌ తో నిర్మాత షాక్‌ అయ్యాడట. ప్రభాస్‌ మూవీ అంటే బాలీవుడ్‌ సినిమాను మించి ఉంటుంది. అయినా కూడా సౌత్‌ సినిమా అవ్వడం వల్ల అంటూ 20 శాతం అధిక పారితోషికంను దీపిక డిమాండ్‌ చేసిందట.

మహానటి వంటి అద్బుత చిత్రాన్ని ఆవిష్కరించిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతుంది. అంటే సినిమాలో హీరోయిన్‌ పాత్ర చాలా అద్బుతంగా ఉంటుంది. అయినా కూడా దీపిక పదుకునే మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సౌత్‌ సినిమా అంటే చిన్న చూపుతోనే దీపిక భారీ పారితోషికంను డిమాండ్‌ చేస్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సౌత్‌ సినిమాలను చిన్న చూపు చూసే దీపిక పదుకునేను ప్రభాస్‌ మూవీలో నటింపజేయాల్సిన అవసరం లేదు అంటూ కొందరు నిర్మాతకు సూచిస్తున్నారు.