దీపికా పడుకొనే మరో తెలుగు సినిమా..?

Wed Mar 29 2023 16:00:01 GMT+0530 (India Standard Time)

Deepika Padukone Another Telugu Film

కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ భామలు తెలుగు సినిమాల్లో నటించాలని ఆసక్తి చూపించరు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడంతో వాళ్లు మనసు మార్చుకున్నారు. టాలీవుడ్ లో వస్తున్న ప్రతి పాన్ ఇండియా సినిమాకు పాన్ ఇండియా హీరోయిన్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ భామలు కియరా అద్వాని అలియా భట్ జాన్వి కపూర్ దీపికా పదుకొనె వంటి స్టార్స్ ఇక్కడ సినిమాలను చేస్తున్నారు. కియరా అద్వాని తన కెరీర్ స్టార్టింగ్ లోనే తెలుగు సినిమాల మీద ఆసక్తి చూపించింది. బాలీవుడ్ లో స్టార్ అయ్యాక కూడా ఇక్కడ సినిమాలు చేస్తుంది.ఇక మరోపక్క ప్రభాస్ కోసం దీపికా పదుకొనెని తీసుకొచ్చారు. ప్రాజెక్ట్ కె లో దీపికా స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఈ సినిమాలో నటించేందుకు దీపికా భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఎన్.టి.ఆర్ 30వ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రాజెక్ట్ కె తర్వాత దీపికాకు మరో తెలుగు సినిమా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. స్టార్ హీరో బడా ప్రొడక్షన్ హౌస్ లో భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమాలో దీపికా పదుకొనె అయితే హీరోయిన్ గా బెటర్ అని అనుకుంటున్నారట.

తను అడిగిన రెమ్యునరేషన్ ఇస్తే దీపికా తెలుగులో సినిమాలు కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిందట. అలా ప్రాజెక్ట్ కె తర్వాత దీపికా పదుకొనె మరో క్రేజీ మూవీ ఫిక్స్ చేసుకుందని టాక్. అయితే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ మాత్రం ఇంకా రాలేదు.

ప్రస్తుతం ఆ స్టార్ హీరో సినిమా ఒకటి సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఆ సినిమా పూర్తి చేశాక ఈ మూవీ గురించి అనౌన్స్ చేస్తారట. అయితే ఇప్పటికే డైరెక్టర్ హీరో కాంబో ఫిక్స్ అయినా బయటకు మాత్రం చెప్పట్లేదని టాక్.

మొత్తానికి దీపిక పదుకొనె తెలుగులో వరుస సినిమాలు చేయాలని అనుకుంటుంది. బాలీవుడ్ సినిమాలే చేసినా దీపికకు తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మడు ఇక్కడ సినిమాలు చేయడం ఆమె ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. రీసెంట్ గా షారుఖ్ పఠాన్ సినిమాలో నటించిన దీపికా ఆ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది.           


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.