రణబీర్ - అలియా జంటని దీపిక లంచ్ కి ఆహ్వానించిందా?

Tue Aug 09 2022 17:00:01 GMT+0530 (IST)

After Learning About Alia's Pregnancy,Deepika Invited The Couple To Lunch Herself

రణబీర్ కపూర్-అలియాభట్ బాలీవుడ్ నవ దంపతులుగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. వివాహం అనంతరం వేరు కాపురానికి పెద్దగా సమయం కూడా తీసుకోలేదు.  పెళ్లైన వెంటనే హానీమూన్ కి కూడా వెళ్లకుండా కొత్త కాపురం పెట్టేసారు. ఇటీవలే అలియా గర్భం దాల్చిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది.మరి ఇప్పుడీ నవ దంపతుల్ని రణవీర్ సింగ్-దీపికా పదుకొణే దంపతులు ప్రత్యేకంగా లంచ్ కి ఆహ్వానించారా? అలియభట్ గర్భం దాల్చిన సందర్భంగానే ఈ ఘటన చోటు చేసుకుందా? అంటే అవుననే వినిపిస్తుంది. ఈ జంట పెళ్లికి దీపిక-రణవీర్ సింగ్ హాజరైన సంగతి  తెలిసిందే. ఖరీదైన బహుమతులు సైతం పెళ్లి సందర్భంగా ఇద్దరికీ వేర్వేరుగా  అందించారు.

తాజాగా అలియా గర్భం దాల్చిన విషయం గ్రహించిన  దీపిక  ఆ దంపతుల్ని  స్వయంగా లంచ్ కి ఆహ్వానించిందిట. లంచ్ కోసం రకరకాల వెజ్-నాన్ వెజ్ వంటకాల్ని అన్నింటిని తయారు చేయించి తానే స్వయంగా వడ్డించిందిట.  అలియాభట్-రణబీర్ కపూర్ పొట్ట చెక్కలయ్యే  వరకూ డైనింగ్ బేటుల్ నుంచి కదలనివ్వలేదుట.

ఓవైపు రణవీర్ సింగ్..మరోవైపు దీపిక కూర్చుని ఎటూ కదలనివ్వకుండా మరీ వంటకాలు రుచి చూపించారుట. వీటిలో కొన్నింటిని దీపిక స్వయంగా స్వహస్తాలో సిద్దం చేసిందిట.  డైనింగ్ సెక్షన్  పూర్తయిన తర్వాత అలియాభట్ కి చేయాల్సిన కొన్ని కార్యక్రామలు సింగ్ సంప్రదాయాల ప్రకారం చేసిందిట. నుదిటి బొట్టుపెట్టడం.. తాంబూలం ఇవ్వడం...చీర..జాకెట్ ఇలా ప్రతీది స్వయంగా నిర్వహించిందిట.

ఇది నిజంగా బాలీవుడ్ లో చాలా రేర్ మూవ్ మెంట్ అని చెప్పొచ్చు. సాధారణంగా ప్రెండ్ షిప్ మీట్ లు...గెట్ టు గెదర్ లు ...పబ్ ల్లో పార్టీ మీట్ లు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ దీపిక దంపతుల వాటికి భిన్నంగా  వ్యవహరించి అందరి మనసు దొచేసారు. చాలా అరుదుగానే ఇళ్లలో జరిగే ఈవెంట్లలో  అంతా కలిసేది.

కానీ దీపిక మాత్రం నవ దంపతుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి ఇలాంటి ఏర్పాట్లు చేయడంతో ఆమె ఇంకా మూలాలు మర్చిపోలేదు అనడానికి తార్కాణంగా చెప్పొచ్చు. అన్నట్లు దీపిక పదుకొణే-రణబీర్ కపూర్ ఒకప్పుడు మాజీ లవర్స్ అన్న సంగతి తెలిసిందే.  కొన్నాళ్లు ప్రేమించుకుని విడిపోయారు.

ఆ తర్వాత రణవీర్ సింగ్ కి దగ్గరై వివాహం చేసుకుంది. ఇక  రణవీర్ సింగ్ ని అలియాభట్  ఎంతోగానే అభిమానిస్తుంది. ఇటీవలే రణవీర్ న్యూడ్ ఫోటోలపై సోషల్ మీడియాలో జరిగిన రచ్చ పై సైతం తనదైన శైలిలో అలియా స్పందించిన సంగతి తెలిసిందే.