Begin typing your search above and press return to search.

కేసీయార్ ప్రభుత్వానికి డెడ్ లైనా?

By:  Tupaki Desk   |   16 Aug 2022 5:47 AM GMT
కేసీయార్ ప్రభుత్వానికి డెడ్ లైనా?
X
కేసీయార్ ప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డెడ్ లైన్ విధించారు. మరో ఆరు లేదా ఏడు నెలల కన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదని స్పష్టంగా చెప్పారు. ఢిల్లీలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని జనాలు గ్రామగ్రామాన పాతరేస్తారని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీయార్ కుటుంబాన్ని ఎవరూ రక్షించలేరని వార్నింగ్ ఇచ్చారు. తమపై టీఆర్ఎస్ శ్రేణులు ఎన్నిదాడులు చేసినా జనాలు మాత్రం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించటం ఖాయమని జోస్యం చెప్పారు.

తెలంగాణా పార్టీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రలో టీఆర్ఎస్ శ్రేణులు కావాలనే గొడవపడినట్లు మండిపడ్డారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు చోద్యం చూస్తుండటం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు.

పోలీసు అధికారులు పూర్తిగా టీఆర్ఎస్ కనుసన్నల్లోనే పనిచేస్తున్నట్లు కిషన్ రెడ్డి ఆరోపించటమే మరీ విచిత్రంగా ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీ, ఐటి శాఖలు కేంద్రప్రభుత్వం చెప్పినట్లు వినకుండా ప్రతిపక్షాలు చెప్పినట్లు వింటున్నాయా ?

కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా రాష్ట్రాల్లో పోలీసులు అధికారంలో ఎవరుంటే వాళ్ళు చెప్పినట్లు వినటంలో ఆశ్చర్యం ఏమీలేదు. అదేదో పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు వినటమన్నది టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే మొదలైనట్లు కిషన్ మాట్లాడటమే విచిత్రంగా ఉంది.

దశాబ్దాల నాటి కేసులను కూడా సీబీఐ, ఈడీలు తవ్వితీసి ఇపుడు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన నేతలపైన కేసులు పెట్టి అరెస్టులు చేయటం లేదా ? కాంగ్రెస్ కీలకనేతగా పనిచేసిన అహ్మద్ పటేల్ చనిపోయిన తర్వాత ఇంతకాలానికి సీబీఐ ఆయన పేరును ఒక కేసులో ఇరికించలేదా ?

పైగా కేసీయార్ ప్రభుత్వం ఉండేది ఇక ఆరేడు నెలలే అని కిషన్ జోస్యం చెప్పటం కూడా ఆశ్చర్యంగానే ఉంది. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర వ్యవధుంది. కేసీయార్ అనుకుంటే మాత్రమే ముందస్తు ఎన్నికలు జరుగుతాయి. మరి కిషన్ ఏ లెక్కలో కేసీయార్ అధికారంలో ఉండబోయేది ఏడునెలలు మాత్రమే అనిచెప్పారు. ఇక్కడ కూడా మహారాష్ట్ర తరహా రాజకీయాన్ని ఏమైనా అమలు చేయబోతున్నారా ?