కైపెక్కించే అందాలతో అల్లాడిస్తున్న రాధే భామ!

Wed Apr 21 2021 09:00:01 GMT+0530 (IST)

Dazzling Disha Patani Sizzles In Beachwear

బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. ఎందుకంటే ఈ భామ తెలుగులో ఒకే సినిమా చేసింది. అది కాస్తా ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. మళ్లీ తెలుగు సినిమాల్లో దిశా నటించలేదు. కానీ సినిమాల సంగతి పక్కనపెడితే అమ్మడు సోషల్ మీడియా యూసర్లకు బాగా సుపరిచితం. ఎందుకంటే సోషల్ మీడియాలో దిశా హవా మాములుగా ఉండదు. అందాలతో కుర్రకారు గుండెల్లో వేగం పెంచే పనిలో పడుతుంది అమ్మడు. అసలే సన్నగా నాజూకుగా చూడగానే ఇట్టే ఆకర్షించే అందం దిశా సొంతం. అలాంటి అందం కలిగిన ఈ బ్యూటీని గ్లామర్ ప్రియులు ఊరికే వదిలేస్తారా.. అలా ఫాలో అయిపోతారంతే.సోషల్ మీడియాలో దిశా ఫాలోయింగ్ కోట్లలో ఉంది. అందుకే అభిమానుల కోసమైనా అమ్మడు ఎప్పటికప్పుడు తాజా ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తుంది. దిశా లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే గ్లామర్ కు మరోపేరులా అందాలను ఆరబోసింది దిశా. అందులోను ఎద పరవాలు నాజూకు నడుం సోయగాలను ప్రదర్శించే సరికి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కైపెక్కిపోతున్నారు. ఇటీవలే బాయ్ ఫ్రెండ్ తో మాల్దీవ్స్ ట్రిప్ వెళ్లిన దిశా.. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అమ్మడు నవ్వుతూ ఫోటోకు పోజిచ్చింది. వెనకే కొబ్బరిచెట్లు కనిపిస్తున్నాయి అంటే దిశా ఇప్పుడు బీచ్ లో ఉందని అర్ధమవుతుంది. అందుకే పొట్టి దుస్తులలో కుర్రాళ్లను అల్లాడిస్తుంది. ప్రస్తుతం అమ్మడు సల్మాన్ ఖాన్ సరసన రాధే సినిమా చేస్తోంది.