చాలామందితో డేటింగ్.. ఎవరూ ఆ కోరిక తీర్చలేదు

Mon Oct 21 2019 16:22:58 GMT+0530 (IST)

ఇలియానా.. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా ఎదిగి స్టార్ హీరోలందరితో చేసిన ముద్దుగుమ్మ. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి రెండు మూడు సినిమాలు చేసింది. ఆ తర్వాత ప్రియుడు డేటింగ్ అంటూ పెళ్లి వార్తలు వచ్చాయి.. తాజాగా ది లవ్ లాఫ్ లైవ్ షో కార్యక్రమంలో ఇలియానా పాల్గొంది. తన వ్యక్తిగత ప్రొఫెషనల్ జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించి సంచలనం సృష్టించింది.ది లవ్ లాఫ్ లైవ్ షోలో ఇలియానా మాట్లాడుతూ ‘నాకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదు.. హీరోయిన్ కావాలనే కోరిక లేదు. కాని యాక్సిడెంట్ గా నేను హీరోయిన్ ను అయ్యాను. వాస్తవానికి నేను సింగర్ కావాలనుకున్నా. కానీ విధి మరోలా తలిచి నన్ను యాక్టర్ ను చేసింది అని ఇలియానా చెప్పుకొచ్చింది.

ఇక తాను సినీ కెరీర్ లో ఉండగా.. చాలా మందితో డేటింగ్ చేశానని.. కానీ ఎవరి నుంచి పుష్పగుచ్చాలు పొందలేదని ఇలియానా హాట్ కామెంట్ చేసింది. నా బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ నాకు అలాంటి గిఫ్ట్ లు ఇవ్వలేదని వాపోయింది. నాకు గుర్తున్న వరకు నా తండ్రి నుంచి మాత్రమే పూల గిఫ్ట్ ను అందుకున్నానని పేర్కొంది. అంతకుమించి నాకు గిఫ్టులు ఎవరూ అందించలేదని ఇలియానా తెలిపింది.

ఇక బాలీవుడ్ లో తనకు హీరోయిన్ నర్గీస్ ఫక్రీ అంటే ఇష్టమని ఇలియానా తెలిపింది. ఆమెతో చక్కటి అనుబంధం ఉందని పేర్కొంది. నర్గీస్ కాకుండా అర్షద్ వార్సీ వరుణ్ ధావన్ తో మంచి సంబంధాలున్నాయని తెలిపింది.