బాలీవుడ్ లో దసరా పరిస్థితి ఏంటి..?

Fri Mar 31 2023 12:01:54 GMT+0530 (India Standard Time)

Dasara Situation in Bollywood

నాని లీడ్ రోల్ లో నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వచ్చిన సినిమా దసరా. సినిమా తెలుగు మాస్ ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేసింది. అయితే దసరా సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేశాడు నాని. అంతేనా ఈ సినిమాను కె.జి.ఎఫ్ ఆర్.ఆర్.ఆర్ సినిమాల రేంజ్ అంటూ అంచనాలు పెంచేశాడు. నార్త్ ఆడియన్స్ ఆ సినిమాలను ఓ రేంజ్ లో చూశారు.ఇంకేంటి దసరా కూడా అదే రేంజ్ లో చూస్తారని అనుకున్నారు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. నాని దసరా కోసం ఎంత భారీగా ప్రమోట్ చేసినా పెద్దగా లాభం చేకూరలేదు. సినిమాకు అక్కడ అంత గొప్ప టాక్ ఏమి రాలేదు. ఓపెనింగ్స్ కూడా పెద్దగా రాలేదని తెలుస్తుంది.

అంతేకాదు నేషనల్ మీడియా సైతం దసరా సినిమాను కొన్ని తమిళ సినిమాలతో పోల్చి తీసిపారేసింది. నాని నటన వరకు ఓకే కానీ మిగతా యాస్పెక్ట్స్ లో కొత్తదనం లేదు ఆల్రెడీ తెలిసిన కథనే కొత్త ఫార్మాట్ లో చెప్పాలని ప్రయత్నించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అంటూ రాసుకొచ్చారు. అయితే తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను సూపర్ డూపర్ అంటున్నా హిందీ ఆడియన్స్ మాత్రం సినిమాని చూసి జస్ట్ ఓకే అనేస్తున్నారు. మరోపక్క ఓవర్సీస్ లో కూడా ప్రీమియర్స్ అడ్వాన్స్ బాగానే కలెక్ట్ చేసినా సినిమా చూసిన అక్కడ ఆడియన్స్ కూడా అసంతృప్తిగా ఉన్నారు.

దసరా సినిమా ఒక కంప్లీట్ రొటీన్ ఎంటర్టైనర్.. సినిమాలో కొన్ని వావ్ ఫ్యాక్టర్స్ ఉన్నా ఓవరాల్ గా సినిమా హిందీ ఆడియన్స్ ని అలరించడంలో తడబడుతుందని చెప్పొచ్చు.

నానికి అక్కడ సరైన మార్కెట్ లేకపోవడం.. ఇలాంటి రా అండ్ రస్టిక్ కథలు ఆల్రెడీ చూసి ఉండటం వల్ల ఇలాంటి సమస్య ఏర్పడి ఉండొచ్చు. దసరా హిందీ వర్షన్ యావరేజ్ టాక్ తో ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ ని రాబట్టలేకపోయింది. అయితే ఒకవేళ సినిమా చిన్నగా అక్కడ ఆడియన్స్ కి ఎక్కుతుందేమో చూడాలి.

నాని కీర్తి సురేష్ ల పర్ఫార్మెన్స్ లు సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా మన ఆడియన్స్ లెక్క అక్కడ ప్రేక్షకులు దసరాకి ఎంగేజ్ అవ్వలేకపోయారన్న టాక్ నడుస్తుంది. మరి దసరా హ్యూజ్ బడ్జెట్ తో భారీ బిజినెస్ తో రిలీజైంది. ఈ టాక్ తో సినిమా బిజినెస్ పరంగా గట్టెక్కుతుందా లేదా అన్నది చూడాలి.       


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.