Begin typing your search above and press return to search.

దసరా.. సుకుమార్ కథతో పోలికలా?

By:  Tupaki Desk   |   20 March 2023 6:00 AM GMT
దసరా.. సుకుమార్ కథతో పోలికలా?
X
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన దసరా మూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతుంది. ఈ మూవీ ప్రమోషన్ లో ప్రస్తుతం నాని బిజీగా ఉన్నాడు. భారీబడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కి ఐదు భాషలలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సింగరేణి సమీపంలో ఒక గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా చేసుకొని ఈ మూవీ కథని శ్రీకాంత్ ఒదేల రెడీ చేసినట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా వెన్నెల అనే పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా పోస్టర్స్ తో నాని, కీర్తి సురేష్ తో పాటు హీరో ఫ్రెండ్ రోల్ ని కూడా ఎక్కువగా ఎలివేట్ చేస్తున్నారు. దీంతో ఈ పాత్రకి కూడా సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుంది అనే మాట వినిపిస్తుంది. నాని కూడా ఈ విషయం చెప్పాడు. సినిమాలో కీర్తి సురేష్ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది అని చెప్పారు. ఇక ట్రైలర్ కట్ లో సముద్రఖనితో పాటు మరో విలన్ ని కూడా చూపించారు.

దీని ద్వారా ఈ మూవీ కథ రెండు వర్గాల మధ్య జరిగిన సంఘర్షణగ ఉంటుంది అనే మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ కథాంశంపై మరో ఇంటరెస్టింగ్ టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. దసరా మూవీ కథ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య 2కి దగ్గరగా ఉంటుందనే ప్రచారం నడుస్తుంది. ఆర్య 2 కథ ప్రకారం చూసుకుంటే హీరోయిన్ కాజల్ అగర్వాల్, అల్లు అర్జున్ నవదీప్ మధ్య కథాంశం నడుస్తుంది. అందులో మంచిగా కనిపించే విలనీగా నవదీప్ ఉంటాడు.

అలాగే నాని చెడ్డగా కనిపించే మంచివాడిగా ఉంటాడు. భిన్నమైన షేడ్స్ ఈ పాత్రలలో ఉంటాయి. ఈ మూవీ ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇంచు మించు దసరా మూవీ కథ కూడా ఇలాంటి ఫ్లేవర్ లోనే ఉంటుంది అని టాక్. నానికి ఫ్రెండ్ గా ఉన్న పాత్రని బలమైన లీడర్ గా సినిమాలో దర్శకుడు చూపించబోతున్నాడు. వాడికి సపోర్ట్ గా ఉండే వ్యక్తిగా నాని పాత్ర ఉంటుంది. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ లో అతనే విలన్ గా ఉంటాడని, కీర్తి సురేష్, నాని, నాని ఫ్రెండ్ క్యారెక్టర్ చుట్టూనే మెయిన్ కథ నడుస్తుంది అని టాక్ నడుస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది రిలీజ్ అయిన తర్వాతగాని తెలియదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.