Begin typing your search above and press return to search.

యూఎస్ బాక్సాఫీసును షేక్ చేస్తున్న దసరా..!

By:  Tupaki Desk   |   30 March 2023 10:35 AM GMT
యూఎస్ బాక్సాఫీసును షేక్ చేస్తున్న దసరా..!
X
నాచురల్ స్టార్ నాని హీరో గా, కీర్తి సురేష్ హీరోయిన్ గా పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న సినిమా దసరా గురించి అందరి కీ తెలిసిందే. అయితే దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల అయిన ఈ చిత్రాని కి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం... ఇప్పటి కే అమెరికాలో ప్రీమియర్ షోలు వేశారు.

ఈ క్రమంలోనే ఈ చిత్రం అక్కడ దుమ్ములేపుతుంది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబడుతూ... సంచలనం సృష్టిస్తోంది. ప్రీమియర్ గ్రాస్ రూ.5.50 లక్షల డాలర్లను సాధించింది. ఇంకా లెక్కింపులు కొనసాగుతున్నాయి. ప్రీమియర్ షోలో నాని కి అత్యధిక వసూళ్లు రాబట్టడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే యూఎస్ లో మిలియన్ డాలర్ల మార్కు ను తాకే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం భారీగానే వసూళ్లు రాబడుతుంద ని అంతా అనుకుంటున్నారు. మరి చూడాలి ఈ రోజు ఏ రేంజ్ లో బాక్సాఫీసును షేక్ చేస్తాడో నాని. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ గా బడ్జెట్ పెట్టి ఈ సినిమాను నిర్మించారు. సింగరేణి మైన్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే బలమైన తెలంగాణ ఆధారిత యాక్షన్ మూవీ డ్రామా గా దసరా తెరకెక్కింది.

ఒకవైపు ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని, కీర్తి సురేష్ పడిపోయి దేశవ్యాప్తంగా తిరిగి సినిమాపై వీలైనంతగా బజ్ క్రియేట్ చేశారు. నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్ వంటి వారు కీలక పాత్రలో నటించారు. సత్యం సూర్య సినిమాటో గ్రఫీ అందించగా, నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు.

మార్చి 30వ తేదీన అంటే ఈ రోజే దేశ వ్యాప్తంగా విడుదల అయింది దసరా మూవీ. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేశారు. ఈ షోలు చూసిన వారంతా ట్విట్టర్ వేధికగా రివ్యూలు రాస్తున్నారు. కేజీఎఫ్ ను దాటే రేంజ్ లో ఉందని నాని ప్యాన్స్ చెబుతున్నారు. అలాగే శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ కు ఫుల్ మార్కులు పడతాయని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.